తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కలిశారు. కాన్వాయ్‌పై టీడీపీ గూండాలు చేసిన రాళ్ల దాడి, గన్‌మెన్‌పై దాడిని సీఎంకు పిన్నెల్లి వివరించారు. కావాలనే చంద్రబాబు హింసను ప్రేరేపిస్తున్నాడని, వైయస్‌ఆర్ సీపీ నేతలపై దాడులను ప్రోత్సహిస్తున్నాడని, రైతుల ముసుగులో కొంతమంది టీడీపీ గూండాలు చేరి దాడి చేశారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సీఎంకు వివరించారు. పిన్నెల్లిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో సీఎం వైయస్ జగన్ మాట్లాడారు.