ప్రజా సంకల్ప యాత్రకు ఏడేళ్లు.. 

ప్ర‌జ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయిన వైయ‌స్ జ‌గ‌న్‌

ఐదేళ్ల వైయ‌స్ఆర్‌సీపీ పాల‌న‌లో రాష్ట్రం సుబిక్షం

అమ‌రావ‌తి: పేదల కష్టాలు తెలుసుకునేందుకు వేసిన తొలి అడుగుకు ఏడేళ్లు పూర్తయ్యాయి. వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సంకల్ప యాత్ర (పాదయాత్ర)కు శ్రీకారం చుట్టి నేటి  తో ఏడు వసంతాలయ్యాయి. 2017 నవంబరు 6వ తేదీన వైయ‌స్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.  దివంగత నేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ నుంచి వైయ‌స్ జగన్ ఈ ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారు. 341 రోజుల పాటు కొనసాగిన ఈ పాదయాత్ర.. 2019 జనవరి 9వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. 13 జిల్లాల్లో 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాలను కలుపుతూ.. మొత్తం 3,648 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగింది. వైయ‌స్ జగన్‌కు అడుగ‌డుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

 

PHOTOS: YS Jagan Mohan Reddy Kicks Off Praja Sankalpa Yatra- Latest Photos,  Pictures, Images And Gallery, Photo Gallery, Oneindia Gallery - Oneindia

ప్ర‌జా సంక‌ల్ప యాత్రలో భాగంగా వైయ‌స్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా పేదల్ని, రైతుల్ని కలుసుకొని.. వారి కష్టాలను అడిగి తెలుసుకొని.. వాటిని తప్పకుండా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ఒక అన్నగా, తమ్ముడిగా, కొడుగ్గా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు.  రైతులు, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాలను కలుస్తూ.. వారి సమస్యలను అధ్యయనం చేస్తూ.. తాను అధికారంలోకి రాగానే వాటి పరిష్కారానికి కృషి చేస్తానంటూ ముందుకు సాగారు వైయ‌స్‌ జగన్‌. 2019లో అధికారంలోకి వ‌చ్చిన వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఇచ్చిన ప్ర‌తి హామీని అమ‌లు చేసి ప్ర‌జ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయారు.  

YS Jagan Praja Sankalpa Yatra: రెండేళ్ల తర్వాత అవే అడుగుజాడలు.. వైఎస్‌  జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు - Telugu News | YS Jagan Mohan Reddy  is four years into the Praja Sankalpa Yatra | TV9 Telugu

నేనున్నాన‌ని భ‌రోసా..

పాద‌యాత్ర‌ సమయంలో జనం చెప్పిన సమస్యలు వింటూ, వారి కన్నీళ్లు తుడుస్తూ ముందకు సాగారు వైయ‌స్‌ జగన్‌. నేను ఉన్నానంటూ.. వారికి ఎనలేని భరోసా నిచ్చారు. చదువు, ఆరోగ్యం కోసం కుటుంబాలు ఆస్తులు అమ్ముకునే పరిస్థితులను తాను చూశానని, కచ్చితంగా ప్రజలకు అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. వివక్షలేని పాలనను అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ముంగిటకే సేవలను తీసుకొస్తానని చెప్పారు. దీంట్లో భాగంగానే మతం చూడకుండా, రాజకీయం చూడకుండా, అవినీతిలేని, వివక్షలేని రీతిలో ప్రజలకు 2019 నుంచి 2024 వ‌ర‌కు ఐదేళ్ల పాటు సంక్షేమ ప‌థ‌కాలు, ప్ర‌యోజ‌నాలు అందాయి.
YS Jagan Praja Sankalpa Yatra : జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి నేటికి  మూడేళ్లు పూర్తి | YS Jagan Praja Sankalpa Yatra Completed three Years

ఇంటి ముగింట‌కే సేవ‌లు

గ్రామ సచివాలయాలు గ్రామ స్వరాజ్య‌సాధనేలో కొత్త ఒరవడిని సృష్టించాయి. గ్రామంలోనే ఉద్యోగాలు వచ్చాయి. సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలు వచ్చాయి. ప్రతి 50 ఇళ్లకూ ఒక వాలంటీర్‌ .. సేవలందించడానికి వచ్చారు.  మళ్లీ పల్లెలకు కొత్త కళ వచ్చింది. గ్రామాలకు ఆస్తులు వచ్చాయి. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు... ఇలా ప్రతి గ్రామానికి విలువైన ఆస్తులు సమకూరాయి. 

YS Jagan Praja Sankalpa Yatra: ప్రజా సంకల్పయాత్రకు ఆరేళ్లు పూర్తి.. - NTV  Telugu
 
 విశ్వ‌స‌నీయ‌త‌కు మారుపేరు..

అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, మహిళా సాధికత, విద్యా దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఇవన్నీ.. ప్రజా సంకల్ప యాత్రలో మొగ్గతొడిగినవే. ప్రజాసంకల్పయాత్రద్వారా ఇచ్చిన హామీలు, వాటిని దాదాపుగా అమలు చేయడంతో... వైయ‌స్ జగన్‌ అనే పేరు విశ్వసనీయతకు మరో రూపంగా నిలబడింది. ప్రజా సంకల్ప యాత్ర రాజకీయంగా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర చరిత్రలోనే చరిత్రాత్మక విజయాన్ని వైయస్‌. జగన్‌ సాధించారు.  2019 మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 చోట్ల వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో 22 చోట్ల ఎంపీలు గెలిచి చరిత్ర సృష్టించారు. 
 
 Sri YS Jagan Mohan Reddy's Praja Sankalpa Yatra has been accorded a rousing  welcome as it enters Visakhapatnam city today on Saturday, 8th September  2018. - Vijayasai Reddy Venumbaka
పింఛ‌న్ల పెంపుపై తొలి సంత‌కం..

ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన మరుక్షణమే తానిచ్చిన మాటకు కట్టుబడి అవ్వాతాతల పింఛన్‌ను రూ.2,250కి పెంచుతూ వైయ‌స్ జగన్‌ తొలి సంతకం చేశారు. మంత్రివర్గం కూర్పులో తనదైన శైలిని ప్రదర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులను కేటాయించి రాజకీయ సంచనం కలిగించారు.  తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనారిటీలకు ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తానని తొలిరోజే ప్రకటించిన వైయ‌స్ జగన్‌ అందులో పేర్కొన్న ‘నవరత్నాలు’ అమలుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు. అన్నీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా దిశా చట్టం తెచ్చారు. చట్టంగా కేంద్రం ఇంకా ఆమోదించకపోయినా.. చట్టం స్ఫూర్తిని నూటికి నూరుపాళ్లు అమలు చేస్తున్నారు. 

 అవే అడుగుజాడలు.. | YSR Congress Party
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర స్ఫూర్తితో పాల‌న 

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌త ఐదేళ్లు ప్రజాసంకల్పయాత్ర స్ఫూర్తి పాలన కొన‌సాగించారు. అందుకే గ‌త ఐదేళ్ల‌లో ఏ ఎన్నిక జ‌రిగినా..విజ‌యం వైయ‌స్ఆర్‌సీపీని వ‌రించింది. తిరుపతి ఉప ఎన్నిక, బద్వేలు ఉప ఎన్నిక, కార్పొరేషన్లు, మున్సిపల్‌ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించారు. ప్రజలనాడిని, వారి గుండె చప్పుడు ప్రమాణాలుగా తీసుకోవడం వల్లే ఈ విజయాలు సాధ్యమ‌య్యాయి.   ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్‌ వచ్చినా.. ప్రజా సంకల్పయాత్రలో వైయ‌స్ జగన్‌గారు తనదిగా మార్చుకున్న ప్రజల గొంతుక ప్రకారమే.. సంక్షేమ పథకాల అమలు దేశంలోనే అగ్రగాయి రాష్ట్రంగా ఏపీ నిలవగలిగింది. ఇంతటి కోవిడ్‌ విపత్తు సమయంలోకూడా ఆకలి చావుకు  తావులేకుండా పరిపాలన కొనసాగింది.

 Jagan Mohan Reddy Padayatra,YS Jagan Praja Sankalpa Yatra: ప్రజా  సంకల్పయాత్రకు ముగింపు.. పైలాన్ ఆవిష్కరించిన జగన్ - ysrcp chief ys jagan  mohan reddy praja sankalpa yatra ends at ichchapuram - Samayam Telugu
ప్రజా సంకల్ప యాత్ర విశేషాలు

  • – మొత్తం రోజులు 341
  • – 13 జిల్లాలు 
  • – నియోజకవర్గాలు 134
  • – 231 మండలాలు
  • – 2516 గ్రామాలు
  • – 54 మున్సిపాలిటీలు
  • – 8 కార్పొరేషన్లలో పాదయాత్ర
  • – 124 సభలు, సమావేశాలు
  • – 55 ఆత్మీయ సమ్మేళనాలు 
  • – 3648 కి.మీ నడక

 
ప్రారంభం – నవంబరు 6, 2017 – ఇడుపులపాయ.
ముగింపు – జనవరి 9, 2019  – ఇచ్ఛాపురం.    

Back to Top