వైయ‌స్ఆర్‌సీపీ శాంతియుత ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

న‌ర్సీప‌ట్నంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల అరెస్టు

అన‌కాప‌ల్లి:  ఇసుక దొంగ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని న‌ర్సీప‌ట్నంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు చేప‌ట్టిన శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.  వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌పై పెట్టిన అక్ర‌మ కేసుల‌కు వ్య‌తిరేకంగా శాంతియుత నిర‌స‌న ర్యాలీ చేప‌ట్టారు. దీంతో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తీరును వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు.వైయ‌స్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే ఉమా శంక‌ర్ గ‌ణేష్ మాట్లాడుతూ..
ప్ర‌భుత్వం చాలా దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని మండిప‌డ్డారు.   దోపిడీ దొంగ‌ల‌ను వ‌దిలేసి ఇసుక దొంగ‌ల‌ను ప‌ట్టించిన మాపై అక్ర‌మ కేసులు పెడుతున్నార‌ని ఉమాశంక‌ర్ గ‌ణేష్ ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జాస్వామ్యంలో పోరాటం చేసే హ‌క్కు లేదా?  దొంగ‌ల‌ను వ‌దిలేసి మాపై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌టం స‌రికాద‌న్నారు. అక్ర‌మ కేసులు ఎత్తివేయాల‌ని ఆయ‌న డిమాండు చేశారు.

Back to Top