రంజాన్ తోఫా పంపిణీ 

అనంతపురం : రంజాన్ పర్వదినంను పురస్కరించుకుని బాబా నగర్ లో 16వ డివిజన్ కన్వీనర్ సీ. సుకేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ...సేవా తత్వానికి ప్రతీక అయిన రంజాన్ పర్వదినంను పురస్కరించుకుని పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని సుకేశ్ ను కొనియాడారు. కార్యక్రమంలో నగర మేయర్ వసీం సలీమ్,డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్, అధికార ప్రతినిధి కృష్ణవేణి,   పూల్ జిలాన్ పీరా జిలాన్ బాష, కేఎం బాష, శామీర్, మున్నా, పల్లవి, జ్యోతి, రసూల్, ఇస్మాయిల్, పలువురు కార్పొరేటర్లు, వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Back to Top