

















వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి
నాగాంజలి కుటుంబ సభ్యులకు వైయస్ఆర్‌సీపీ నేతల పరామర్శ
తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ నాగాంజలి ఆత్మహత్య చేసుకొని పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వానికి పట్టదా అని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. ఆత్మహత్యకు పాల్పడిన నాగాంజలి కుటుంబాన్ని పరామర్శించిన వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, అధికార ప్రతినిధి శ్యామల, మాజీ ఎంపీ భరత్ రామ్, తదితరులు మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ.. నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి 10 రోజులైనా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనను పట్టించుకోరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక యువతని దారుణంగా హింసించి ఆత్మహత్యకు పురుగలిపేలా చేసిన వ్యక్తిపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఏ హాస్పిటల్లో అయితే బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందో అక్కడే ట్రీట్మెంట్ చేయించడం దారుణమన్నారు. ఈ ఘటనపై జిల్లా అధికార యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ను ఇప్పటి దాకా ఎందుకు తల్లిదండ్రులకు చూపించలేదని ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై సిట్ వేసి దర్యాప్తు జరపాలని వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.
న్యాయం జరిగే వరకు పోరాడుతాం: శ్యామల
నాగాంజలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల పేర్కొన్నారు. కూతురి ఆత్మహత్యతో బాధిత కుటుంబ తల్లడిల్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సహాయంగా ఉండాల్సిన ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందని ఆమె ప్రశ్నించారు. మహిళలకు అన్యాయం జరిగితే ఒప్పుకోనన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని నిలదీశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. నాగాంజలికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాటు చేయాలని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలన్నారు. నాగాంజలిని దీపక్ దారుణంగా హింసించారని తెలిపారు. అధికార తెలుగుదేశం పార్టీకి దీపక్ సన్నిహితుడు కావడంతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ ఘటణపై సమగ్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.