రాజకీయ దురుద్దేశ్యంతోనే కాకాణిపై ఎస్సీ, ఎస్టీ కేసు

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ మేరీగ ముర‌ళీధ‌ర్‌

శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా:  రాజ‌కీయ దురుద్దేశ్యంతోనే వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేశార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ మేరీగ ముర‌ళీధ‌ర్ మండిప‌డ్డారు. శుక్ర‌వారం స్థానిక పార్టీ జిల్లా కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా రాజకీయాలను బ్రష్టు పట్టించార‌ని మండిప‌డ్డారు. ఆధారాలు లేకుండానే ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నిస్తున్న  వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డికి  బెయిల్ రాకుండా అధికార పార్టీ నేత‌లు కుట్ర‌లు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆధారాలు లేకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయ‌కూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా..పోలీసులు పాటించ‌డం లేద‌న్నారు.  ఎస్సీ, ఎస్టీల ర‌క్ష‌ణ కోసం తీసుకొచ్చిన అట్రాసిటీ చట్టాన్ని పోలీసులు దుర్వినియోగం చేస్తున్నార‌ని ముర‌ళీధ‌ర్ త‌ప్పుప‌ట్టారు.

Back to Top