తిరుపతి: కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో వీధి నాటకం ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు పెంచబోమని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత అనుసరిస్తున్న విధానాలను అభినయ్‌రెడ్డి వినూత్న రీతిలో ఎండగట్టారు. `విద్యుత్ దోపిడీకి గుణపాఠం చెబుదాం` అనే వీధి నాటకాన్ని తిరుపతి నగరంలోని వినాయక సాగర్ పార్క్‌లో శుక్రవారం ప్రదర్శించారు. విద్యుత్ చార్జీల పెంపుతో సామాన్య గృహిణులు, సామాన్య ప్రజలు, రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వీధి నాటకం రూపంలో కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాస్కులు ధరించి ప్రజలను ఎలా మోసం చేశారో చూపించారు.అలాగే వైయస్ జగన్ ప్రభుత్వం వస్తే ఎలాంటి మేలులు చేస్తారో ఈ ప్రదర్శన ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశారు. తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వీధి నాటకం నగర ప్రజలను ఆకట్టుకుంది..ఆలోచింపజేసింది. భూమన అభినయ్‌రెడ్డి నిర్వహించిన వీధి నాటకం... https://x.com/YSRCParty/status/1908043523422605408