వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌పై టీడీపీ గూండాల దాడి

అన్న‌మ‌య్య జిల్లా: రాజంపేట మండ‌లం కొమ్మివారిపల్లి ఎస్సీ కాలనీలో వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త వెలగచెర్ల వెంకట సుబ్బయ్యపై టీడీపీ గూండాలు క‌త్తులు, క‌ర్ర‌ల‌తో దాడి చేశారు. టీడీపీకి చెందిన కావుటూరి సుబ్రమణ్యం(మణి) నాయుడు వర్గీయులు తనపై కత్తులు, రాడ్లతో దాడి చేసినట్లు బాధితుడు వెంకట సుబ్బయ్య తెలిపారు. ఈ దాడిలో వెంకట సుబ్బయ్య తల మీద, చేతులు, కాళ్ళకు తీవ్ర గాయాల‌య్యాయి. కుటుంబ స‌భ్యులు చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా వైయ‌స్ఆర్‌సీపీ నేత  ఆకేపాటి అనీల్ కుమార్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. దాడికి పాల్ప‌డిన వారిని శిక్షించాల‌ని అనీల్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top