అమ‌రావ‌తి ముసుగులో అడ్డ‌గోలు దోపిడీ

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి   

తాడేప‌ల్లి: అమరావతి రాజ‌ధాని ముసుగులో చంద్రబాబు తన బినామీలకి అడ్డగోలుగా దోచిపెడుతున్నాడ‌ని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి  మండిప‌డ్డారు.  శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..అమ‌రావ‌తి ఐకానిక్ టవర్స్ నిర్మాణం కోసం పిలిచిన టెండర్లు చూస్తే చదరపు అడుగుని దాదాపు డబుల్ చేసేశార‌ని త‌ప్పుప‌ట్టారు. అలానే మొబలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చేసి తమ కమీషన్లను కూటమి నేతలు తీసేసుకుంటున్నార‌ని ఆరోపించారు. ఈ దోపిడీ ఇంతటితో ఆగేలా లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌తంలోనూ ఇలాగే చంద్ర‌బాబు అమ‌రావ‌తి పేరు చెప్పి త‌న బినామీల‌కు దోచిపెట్టార‌ని ఫైర్ అయ్యారు. చంద్ర‌బాబు పాపం పండే రోజు వ‌స్తుంద‌ని, ప్ర‌జ‌లే త‌గిన స‌మ‌యంలో ఆయ‌న‌కు గుణ‌పాఠం చెబుతార‌ని కారుమూరు వెంక‌ట్‌రెడ్డి హెచ్చ‌రించారు. 

Back to Top