కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ నిర్వీర్యం  

 డిగ్రీ విద్యార్థులపై ఎలుకలు దాడి ఘటన మీద చర్యలు తీసుకోవాలి 

వైయ‌స్ఆర్ స్టూడెంట్ యూనియ‌న్ డిమాండ్ 

అనంతపురం:  కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ నిర్వీర్యమైంద‌ని వైయ‌స్ఆర్ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ మండిప‌డ్డారు. అనంతపురం స్థానిక ఆర్టీవో కార్యాలయం పక్కన ఉన్న కె.స్.న్ ప్రభుత్వ బాలికల కళాశాలలో గల వసతిగృహంలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిలపై ఎలుకల దాడి ఘటనపై వైయ‌స్ఆర్‌ విద్యార్థి విభాగం నేత‌లు చంద్రశేఖర్ యాదవ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, త‌దిత‌రులు హాస్ట‌ల్‌ను సంద‌ర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యార్థుల మీద కపట ప్రేమ చూపిస్తుందని కనీస స్పందన లేకుండా విద్యార్థుల మీద కక్ష సాధిస్తుందని ప్రభుత్వ విద్య మీద నిర్లక్ష్య ధోరణి వహిస్తుందని గతంలో కూడా ఇదే కళాశాలలో ఆహార నాణ్యత సరిగా లేదని విద్యార్థినీలు,విద్యార్థి సంఘాలు ఆందోళన చేసిన మాట మరవకముందే మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు నిద్రపోతున్న సమయంలో పదిమందికి ఎలకలు కరవడం ఏంటి అని పారిశుద్యం కూడా సరిగా చూసుకోలేని పరిస్థితులలో కూటమి ప్రభుత్వం ఉన్నదని  కనీస స్పందన కూడా లేకుండా స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కలెక్టర్ గారు ఉండడం దేనికి సంకేతమని కళాశాల వసతిగృహం సంఘటన మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి విద్యార్థులకి మరొక్కసారి పాములు, ఎలుకల దాడి లేకుండా భారోసా ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వారు మాట్లాడుతూ.. ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యను సర్వనాశనం చేసే దిశగా  కూటమి ప్రభుత్వం చూస్తున్నదని ఆరోపించారు.

 చదువుతున్న విద్యార్థినిలకు, చిన్న పిల్లలకి రాష్ట్రంలో రక్షణ కరువైందని విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు సంస్కరణలు తెస్తానంటుంటే గత ప్రభుత్వం చేసిన విద్యాభివృద్ధితో పోటీ పడుతుందనుకున్నాము గాని ప్రభుత్వ విద్యను పేదలకు దూరం చేసే కుట్ర చేస్తున్నారు అని ఇప్పుడు అర్థమవుతుందని కొన్ని రోజుల్లో డిగ్రీ పరీక్షలు మొదలవుతున్న తరుణంలో ఈ విధంగా విద్యార్థులను ఎలుకలు కొరకడం ఏంటని వారు పరీక్షలు ఎలా రాయాలని వసతిదీవెన లేక విద్యార్థులు వారి తల్లితండ్రులు ఆర్థిక భారం మోస్తున్నారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో విద్యార్థులకి శానిటరీ పాడ్స్,మధ్యాహ్న భోజనం నుంచి వారి యొక్క ఆరోగ్య విషయం వరకు ఖచ్చితమైన పర్యవేక్షణ ఉంటూ విద్యా దీవెన మరియు వసతిదీవెన లాంటి పథకాలతో విద్యార్థులకు అండగా నిలిచిన సందర్భం ఉండేదని మరి ఈ ప్రభుత్వంలో ఆలా లేదు అని విద్యా ఉన్నవాడికి అందె ద్రాక్షలా మార్చే సంకల్పం మంత్రి నారా లోకేష్ కి ఉన్నదని ఆరోపించారు.

ఇలాంటి ఘటనలు జరుగుతున్న కళాశాల వారి బాధ్యతారహితమైన నిర్లక్ష్యం ఉందని వారి మీద కమీషనర్ లేదా ఆర్ జె డి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు విద్యార్ధి విభాగం,మహిళావిభాగం నగర అధ్యక్షులు కైలాస్, చంద్రలేఖ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ముఖ్యంగా విద్యార్థినిల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది అని అనంతపురం విద్యార్థులపై ఎలుకల దాడి జరిగింది అంటే కూటమి ప్రభుత్వం విద్యార్థుల మీద నిర్లక్ష్య వైఖరి అర్థం అవుతుందని నారా లోకేష్ విద్యా వ్యవస్థ మీద పూర్తిగా పట్టు తప్పారని వ్యాఖ్యానించారు.  కార్యక్రమంలో వైయ‌స్ఆర్ విద్యార్థి నాయకులు వెంకట్, రాహుల్ రెడ్డి, నవాజ్, బాలు, రాంభూపాల్ రెడ్డి, సూర్య,గంగ శివుడు,రాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

Back to Top