వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త కిడ్నాప్‌

బాధిత కుటుంబంలో తీవ్ర ఆందోళ‌న‌

ప‌ల్నాడు:  మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హరిచంద్రను టీడీపీ నాయ‌కులు కిడ్నాప్ చేశారు. అయితే తెలుగుదేశం నాయకుల‌తో ఆయ‌న‌కు ప్రాణ‌భ‌యం ఉంద‌ని కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.  మాచర్ల నియోజకవర్గం పశువేమలకు చెందిన హ‌రిచంద్ర‌ను గ్రామంలో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో ఊర్లోకి రాకుండా టీడీపీ నాయ‌కులు అడ్డుకున్నారు. దీంతో హ‌రిచంద్ర కుటుంబం నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీలో నివ‌సిస్తున్నారు. పింఛ‌న్ తీసుకునేందుకు గ్రామంలోని సత్యనారాయణ స్వామి టెంపుల్ వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ హరిచంద్ర ను టీడీపీ నాయకులు బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. రెండు రోజులు అవుతున్నా ఇంత‌వ‌ర‌కు ఎక్క‌డ దాచారో అర్థం కావ‌డం లేద‌ని, హరిచంద్రను చంపేస్తారేమో అని భయంగా ఉంద‌ని కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.  

Back to Top