గూండాయిజాన్ని పెంచిపోషిస్తున్న లోకేష్‌

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి ఫైర్‌

పల్నాడు జిల్లా: రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ముందుపెట్టి రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ గూండాయిజాన్ని పెంచి పోషిస్తున్నార‌ని మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ ప‌ల్నాడు జిల్లా అధ్య‌క్షుడు పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి మండిప‌డ్డారు. మాచర్ల నియోజకవర్గం పశువేమల గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హరిచంద్రను టీడీపీ నేత‌లు రెండు రోజుల క్రితం నాగార్జునసాగర్ హిల్ కాలనీలో కిడ్నాప్ చేసిన చంపి ఆయన పొలంలోనే మృతదేహాన్ని పడేశారు. పశువేమల గ్రామంలోని హరిచంద్ర మృతదేహాన్ని పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ కార్య‌క‌ర్త హ‌త్య‌ను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. 

Back to Top