తాడేపల్లి: స్వాతంత్ర్య సమర యోధుడిగా, రాజకీయ నాయకుడిగా, ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్‌రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. నేడు బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్బంగా వైయస్ జగన్ ఆయనకు ఘన నివాలులర్పించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. వైయస్ జగన్ ఎక్స్ వేదికగా.. ‘దళితులు, అణచివేతకు గురైన వర్గాల వారికి అండగా ఉంటూ వారి హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్‌రామ్. స్వాతంత్ర్య సమర యోధుడిగా, రాజకీయ నాయకుడిగా, ఉప ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ఆ మహనీయుడు అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శనీయం. జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు’ అర్పిస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.