తాడేపల్లి: స్వాతంత్ర్య సమర యోధుడు, ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు నాయకులు ఏమన్నారంటే... మేరుగ నాగార్జున, మాజీ మంత్రి అస్పృస్యత, అంటరానితనం వేళ్ళూనుకున్న నాటి రోజుల్లో భారతదేశానికి ధృవతారలా నిలిచారు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ గారి ఆలోచనా విధానం, సంస్కరణలు దేశ అభ్యున్నతికి మార్గమయ్యాయి, నేటి ప్రభుత్వాలు వాటిని పాటించాలి, ముఖ్యంగా ఏపీలో వైయస్ జగన్ పేదరికం రూపుమాపే ప్రయత్నం చేశారు, అంబేద్కర్, జగ్జీవన్ రామ్ గారి ఆలోచనలను అమలుచేసిన ఏకైక సీఎం జగన్ , ఉన్నత కులాలతో సమానంగా పేదలను తీసుకురావాలని ఆయన ప్రయత్నించారు, గొప్ప ఆశయంతో బీఆర్ అంబేద్కర్ మహా శిల్పాన్ని ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం దానిని పట్టించున్న పాపాన పోలేదు, పైగా దళితులపై దాడులు, అక్రమ కేసులు, గ్రామ బహిష్కరణలు చేస్తున్నారు. సమాజంలో ఉన్న అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులను అందరూ గమనించాలి, మనమంతా కలిసి నడుద్దాం, భావితరాల భవిష్యత్ బావుండాలంటే కూటమి ప్రభుత్వానికి చరమగీతం పాడాలి. నందిగం సురేష్, మాజీ ఎంపీ బాబూ జగ్జీవన్ రామ్ స్పూర్తితో ముందుకెళుతూ ఆయన ఆశయ సాధనకు జగన్ గారు కృషిచేశారు. కానీ నేటి ప్రభుత్వం ఆయన ఆశయాలు పక్కనపెట్టి విధ్వంసాలు చేస్తూ అణగారిన వర్గాలపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తుంది. కూటమి ప్రభుత్వ రాక్షస పాలన ప్రజలంతా గమనిస్తున్నారు. అణగారిన జాతుల కోసం పనిచేసిన మహానుభావులు బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్, వారి ఆశయ సాధనకు మనమంతా పాటుపడదాం, పోరాడి సాధిద్దాం ఎం. అరుణ్ కుమార్, ఎమ్మెల్సీ దళితులకు అత్యున్నత పదవులు కల్పించిన సీఎంగా జగన్ గారు చరిత్ర సృష్టించారు, ప్రతి దళితుడు తల ఎత్తుకు తిరిగేలా నిలిపిన వ్యక్తి ఆయన, అవకాశం ఇస్తే ఆకాశమే హద్దుగా నిరూపించి మమ్మల్ని సమాజంలో నిలబెట్టారు, అంబేద్కర్, జగ్జీవన్ రామ్ ఆశయాలను జగన్ గారు పాటించారు, కూటమి ప్రభుత్వం దళితుల పట్ల అవలంభిస్తున్న వివక్షకు త్వరలో చరమగీతం పాడుదాం, మళ్ళీ జగన్ గారి నాయకత్వం రాష్ట్రానికి అవసరం టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే, ఎస్‌సీ సెల్ ప్రెసిడెంట్ భారతదేశ స్వరూపాన్ని మార్చిన మహనీయుల్లో బాబూ జగ్జీవన్‌రామ్ ఒకరని గర్వంగా చెప్పవచ్చు, ఆయన చూపిన మార్గంలో ముందుకెళడం మన ముందున్న ధర్మం, మా అధినేత జగన్ గారు కూడా జగ్జీవన్ రామ్ గారి అడుగుజాడల్లో ముందుకుసాగుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగ్జీవన్‌రామ్ గారిని స్మరించుకుంటూ నివాళులర్పిస్తుంది. మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే సువిశాల భారతదేశంలో బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన మహానీయుడు బాబూ జగ్జీవన్‌రామ్, ఆయన అనేక పదవుల్లో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు సమాజ ఉన్నతికి దోహదం చేశాయి, ఆయన అడుగుజాడల్లో మనమంతా ముందుకు సాగుదాం కైలే అనిల్, మాజీ ఎమ్మెల్యే గత ఐదేళ్ళలో వైయస్ జగన్ బాబూ జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషిచేశారు, చరిత్ర ఉన్నంతకాలం జగజ్జీవన్ రామ్‌ను సమాజం గుర్తించుకుంటుంది ఈ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, కొమ్మూరి కనకారావు, కాకుమాను రాజశేఖర్, అంకంరెడ్డి నారాయణమూర్తి, వేల్పుల రవికుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.