తాడేపల్లి: శ్రీ సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. శ్రీ సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని వైయస్ జగన్ అభిలషించారు. ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ శ్రీ సీతారాముల అనుగ్రహం లభించాలని వైయస్ జగన్ అభిలషించారు.