వైయ‌స్ఆర్‌సీపీ మండ‌ల క‌న్వీన‌ర్‌పై వేటకొడవళ్లతో దాడి 

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ గూండాల అరాచ‌కం

నంద్యాల:  జిల్లాలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేత ఇందూరి ప్రతాప్ రెడ్డిపై టీడీపీ గూండాలు వేటకొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామంలోప్రతాప్ రెడ్డి గుడిలో ఉండగా దాడికి దిగారు.  శనివారం జరిగిన ఈ దారుణ ఘటనలో ప్రతాప్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో నంద్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స  పొందుతున్న ప్రతాప్ రెడ్డిని బ్రిజేంద్రారెడ్డి పరామర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డి గన్ మెన్ ను తొలగించడం కూడా దాడికి ముందస్తు ప్రణాళికలో భాగంగానే కనిపిస్తోందని బ్రిజేంద్రారెడ్డి మండిపడ్డారు.

May be an image of 8 people

ఏపీలో శాంతి భద్రతలు అధ్వాన్నం
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో శాంతి భద్రతలు అధ్వానంగా మారాయని వైయ‌స్ఆర్‌సీపీ మండిపడింది. చంద్రబాబు పాలనలో మళ్లీ ఫ్యాక్షన్ పడగవిప్పుతోందని,  ప్రతాప్ రెడ్డిపై దాడి చేసిన వారంత టీడీపీ కార్యకర్తలేనని వైయ‌స్ఆర్‌ సీపీ ఆరోపిస్తోంది.  గతంలో ప్రతాప్ రెడ్డి అన్న, బావమరిదిని హత్య చేసిన నిందితులే మళ్లీ ఇప్పుడు ప్రతాప్ రెడ్డిని టార్గెట్ చేశారని మండిపడుతోంది.  

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ప‌రామ‌ర్శ‌
నంద్యాల ఉదయానంద హాస్పిటల్ లో గోవిందపల్లె గ్రామానికి చెందిన వైయస్ఆర్ సీపీ నాయకుడు ఇందూరి ప్రతాప్ రెడ్డి ని   వైయస్ఆర్ సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు  కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి , ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి,  పరామర్శించి డాక్టర్లను ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంత‌రం జిల్లా ఎస్పీని క‌లిసి సంఘ‌ట‌న‌పై ఫిర్యాదు చేశారు. 

May be an image of 5 people

Back to Top