పీక్ స్టేజ్‌కు క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు

ఎంపీ మిథున్‌ రెడ్డి అరెస్టుకు కుట్ర.. 
 

ఢిల్లీ: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం వైయ‌స్ఆర్‌సీపీ  నేతలను టార్గెట్‌ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే వైయ‌స్ఆర్‌సీపీ  ఎంపీ మిథున్‌ రెడ్డి అరెస్ట్‌కు ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి.

మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని ఏపీ సీఐడీ.. ఇటీవలే హైకోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ ​వ్యవహారానికి సంబంధించి ఎంపీ మిథున్‌ రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదని కోర్టుకు ఏపీ సీఐడీ తెలిపింది. దీంతో, మిథున్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్‌ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజునే ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి. మిథున్‌ రెడ్డి అరెస్ట్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నాయి. మరోవైపు.. మిథున్‌ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

ఇక, మద్యం వ్యవహారంలో ఆది నుంచీ ఏపీ సీఐడీ పోలీసుల తీరు వివాదాస్పదంగానే ఉంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాజకీయ వేధింపులు, కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వ్యక్తులను బెదిరించి సీఐడీ తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంది. తప్పుడు వాంగ్మూలాల్లో తమకు కావాల్సిన వారి పేర్లను చెప్పించారు సీఐడీ అధికారులు. ఈ క్రమంలో తప్పుడు వాంగ్మూలాల ఆధారంగా వారి అరెస్టుకు ముందడుగులు వేస్తున్నారు.  అలాగే, తప్పుడు వాంగ్మూలాల్లో పేర్కొన్న వ్యక్తుల ఇళ్లలో సీఐడీ సోదాలు చేసింది. నిన్న హైదరాబాద్‌లో పలువురి ఇళ్లల్లో సోదాలు కొనసాగాయి.  ఈ సోదాల సందర్భంగా ఇళ్లల్లో ఉన్న మహిళలను బెదిరింపులకు గురిచేసినట్టు సమాచారం. పోలీస్‌ స్టేషన్లకు రప్పిస్తామంటూ మహిళలకు వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. 
 

Back to Top