వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో మైనార్టీలకు చంద్రబాబు తీరని ద్రోహం

ష‌ర్మిల‌ రాజకీయాలు కాంగ్రెస్ కోసమా?, బాబు కోసమా?’ 

వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ సూటి ప్ర‌శ్న‌

తాడేపల్లి: వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో మైనార్టీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీలు తీరని ద్రోహం చేశాయని వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు .   వక్ఫ్ బిల్లు అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు పీసీసీ అధ్యక్షురాలిగా ఉ‍న్న వైఎస్ షర్మిలతో ాట్లాడిస్తున్నారన్నారు. ఒక అంశాన్ని డైవర్ట్ చేయడానికి మరొక అంశాన్ని పైకి తేవడం చంద్రబాబుకి అలవాటని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజకీయాల్లో ఎప్పుడు కష్టాల్లో ఉన్నా, డైవర్షన్‌ చేయడానికి షర్మిలను ఉపయోగించుకుంటున్నారన్నారు. వైఎస్ జగన్ లక్ష్యంగా చంద్రబాబు చేస్తున్న రాజకీయాల్లో ఆమె ఒక భాగంగా మారారన్నారు.  ఈ మేరకు శైలజానాథ్‌ ఒక వీడియో విడుదల చేశారు. 

ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా, వారికిచ్చిన మాట తప్పుతూ వక్ఫ్‌ బిల్లు విషయంలో మైనార్టీలకు చంద్రబాబునాయుడుగారు ద్రోహం చేశారు. ఇప్పుడు వారికి సమాధానం చెప్పలేక టీడీపీ పార్టీ నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా  షర్మిళగారి రంగంలోకి దిగారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. 

విజయవాడ వరదలు అంశం అయినా, తిరుపతి లడ్డూ విషయం అయినా, ఇప్పుడు వక్ఫ్‌ బిల్లు విషయం అయినా ఇలా చంద్రబాబుగారి ప్రభుత్వం ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా డైవర్ట్‌ చేయడానికి షర్మిళగారు రావడం, ప్రెస్‌మీట్లు పెట్టడం అన్నది ఒక రివాజుగా మారింది. 

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిళగారు ప్రభుత్వంలో ఉన్నవారిని నిలదీయాలి, ప్రజల తరఫున ప్రజా సమస్యలపై వారిని ప్రశ్నించాలి. కాని దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతిపక్షంలో ఉన్నవారిని నిలదీస్తూ ఒక ప్రతిపక్షానికి చెందిన రాష్ట్రశాఖ అధ్యక్షురాలైన షర్మిలగారు రాజకీయాలు చేస్తున్నట్లుంది. రాజకీయాల్లో ఇది వింతగా ఉంది. చంద్రబాబుగారు ఎప్పుడు డైవర్షన్‌ కావాలనుకుంటే అప్పుడు ఆమె రంగంలోకి దించుతున్నారు. 

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె ఏం చేస్తున్నారన్నదానిపైనే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.మరి ఆమె చేస్తున్న రాజకీయాలు కాంగ్రెస్‌ పార్టీకోసమా? లేక చంద్రబాబుకోసమా? 

గత ఎన్నికల్లో ఎన్డీయేను గెలిపించడమే లక్ష్యంగా పనిచేశారు. వారికి సంబంధించిన మాధ్యమాల్లో వారు చెప్పినట్టుగానే మాట్లాడారు. ఆమేరకే నడుచుకున్నారు. ఇక్కడే షర్మిళగారి అసలు ఉద్దేశాలు బయటపడ్డాయి. 

తరచుగా వివేకం అన్న హత్యకు సంబంధించి షర్మిళగారు పదేపదే మాట్లాడుతున్న తీరు అత్యంత బాధాకరం. సొంత చిన్నాన్నను తామే చంపామని, టీవీ లైవ్‌ల్లో మాట్లాడిన వారు ఇప్పుడు అప్రూవర్లుగా మారారు. వారికి బెయిల్స్ రావడంలో వీళ్లంతా సహకరించారు. ఇప్పుడు దర్జాగా వారు బయట తిరుగుతున్నారు. ఇది అన్యాయం, అధర్మం కాదా? 

అవినాష్‌రెడ్డిని ఎందుకు ఇరుకున పెట్టాలన్న ప్రయత్నంచేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. 

వివేకాగారు మరణం సమయంలో దొరికిన లెటర్‌ను పోలీసులు ఇవ్వొద్దని ఆయన వివేకా పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించింది, వివేకా అల్లుడు, సునీత భర్తే. మరి ఈవిషయంపై ఎందుకు విచారణ జరగడం లేదన్నది అంతుపట్టని విషయం. 

వివేకాగారితో ఆయన పీఏ కృష్ణారెడ్డికి దాదాపు 40 సంవత్సరాల అనుబంధం ఉంది. అలాంటి కృష్ణారెడ్డిని తప్పుడు సాక్ష్యాలు చెప్పమని, బెదిరించి, భయపెట్టి వైయస్‌.సునీత, ఆమె భర్త ఒత్తిడి తెచ్చారని కృష్ణారెడ్డి స్వయంగా మీడియా ముఖంగా చెప్పారు. మరి తప్పులు ఎవరు చేస్తున్నట్టు? 

ఇదంతా చంద్రబాబుగారు ఆడుతున్న పొలిటిక్ డ్రామా కాదా?  రాజకీయంగా జగన్‌గారితో ఎవరు ఉన్నా, వారిని ఇబ్బందిపెట్టాలనే లక్ష్యంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారన్నది నిర్వివాదాంశం. 

వైయస్‌.అవినాష్‌రెడ్డిగారిని ఇరికించాలనే ప్రయత్నంచేసినా, లోక్‌సభ సభ్యుడు పి.మిథున్‌రెడ్డిగారిని లాంటివారిపై బురదజల్లి వారిని ఇబ్బందిపెట్టాలని  ప్రయత్నంచేసినా.. వీటన్నింటి వెనుక మాస్టర్ బ్రెయిన్‌ ఎవరో షర్మిళగారికి తెలియదా? ఆయన ఏంచెప్తే అది మీరు చేయడం నిజం కాదా? 

డబ్బుకోసం పార్టీ మారానంటూ నాపై బురదజల్లే ప్రయత్నంచేశారు. మీరు ఏ డబ్బుకోసం తెలంగాణలో పార్టీ పెట్టారు? ఏ డబ్బుకోసం ఆపార్టీని మూసేశారు? ఏ డబ్బుకోసం మళ్లీ ఈ రాష్ట్రం వచ్చి కాంగ్రెస్‌ అధ్యక్షురాలయ్యారు? ఏ పార్టీకోసం అధికార పక్షంపైకాకుండా ప్రతిపక్షంపైన, మీ అన్నగారిపైన అడ్డగోలు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు? డబ్బు డబ్బు అనే మాట ఎవరి చుట్టూ వినిపిస్తుందో ప్రజలందరికీ తెలుసు.

Back to Top