ఏ ఇంటికి వెళ్లినా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు నీరాజ‌నాలే

‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్య‌క్ర‌మంలో రీజినల్ కో-ఆర్డినేటర్  సుబ్బారెడ్డి

విశాఖ‌: సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా భవిష్యత్‌ తరాలకు భరోసా ఇస్తున్నారని, అన్నివర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి  తెలిపారు. ప్రజల ఇంటి ముంగిటకే సంక్షేమ ఫలాలు అందిస్తుండడంతో ‘జగనన్నే మా భవిష్యత్తు’ అంటూ ప్రజలు ముఖ్యమంత్రికి నీరాజనాలు పలుకుతున్నారని తెలిపారు. సోమ‌వారం విశాఖపట్నం జిల్లా తాటిచెట్లపాలెం అభయ ఆంజనేయస్వామి ఆలయం దగ్గర యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆళ్ల శివ గణేష్ ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్తు పేరిట యువ రథంను వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. అనంత‌రం ప‌లు ఇళ్ల‌ను ద‌ర్శించిన వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల బుక్‌లెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నివర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పథకాల రూపకల్పన చేశారని, అందుకే ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థల ద్వారా గ్రామస్థాయిలోనే ప్రజల సమస్యలను తెలుసుకొని త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.  

Back to Top