17 మెడిక‌ల్ కాలేజీలు నిర్మించిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్‌దే

ఎమ్మెల్సీ  సిపాయి సుబ్రహ్మణ్యం 

అసెంబ్లీ మీడియా పాయింట్‌:  దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఐదేళ్ల పాల‌న‌లో 17 మెడికల్ కాలేజీలు నిర్మించిన ఘ‌న‌త వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌ని ఎమ్మెల్సీ సిపాయి సుబ్ర‌హ్మ‌ణ్యం తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పేద‌లకు ఉచిత వైద్యం అందించాల‌నే ఆశ‌యంతో వైయ‌స్ జ‌గ‌న్ 17 మెడిక‌ల్ కాలేజీలు నిర్మించార‌న్నారు.  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అందులో 10 కాలేజీలు పీపీపీ పద్దతిలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హెల్త్ మినిస్ట‌ర్ ప్ర‌క‌టించ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌న్నారు. ప్రభుత్వం ప్రవేట్ మోడల్ తీసేసి.. ప్రభుత్వమే మెడిక‌ల్ కాలేజీల‌ను నిర్వహించి ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌ని సుబ్ర‌హ్మ‌ణ్యం డిమాండ్ చేశారు. 

Back to Top