జగనన్న కటౌట్ చూస్తేనే ప్రతిపక్షాలకు ఫీజులు ఎగిరిపోతాయి

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్‌కే. రోజా 

 ప్రజలు మెచ్చిన నాయకుడు.. తలెత్తుకుని తిరిగే వీరుడు జగనన్న

  వెన్నుపోటు వీరుడు చంద్రబాబు వెన్నులో వణుకుపుట్టించిన పార్టీ వైఎస్ఆర్సీపీ

 వైయ‌స్ఆర్ గారి ఆశయాలకు ప్రతి కార్యకర్త పునరంకితం కావాలి

  ఏపీలో మహిళలకు దక్కిన పదవులు, రక్షణ, గౌరవం మరెక్కడా లేదు

 చంద్రబాబును మించిన ఉన్మాది దేశంలో ఎవరూ ఉండరు

బాబు, పవన్ లకు దమ్మూ, ధైర్యం ఉంటే జగన్ గారితో విడివిడిగా పోటీ పడగలరా..?

  టీడీపీలో ఆడవాళ్ళు తొడలు కొడతారు.. మగవాళ్ళు ఏడుస్తారు.. అదొక జంబలకడిపంబ పార్టీ..

 
 గుంటూరు:   ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కటౌట్ చూస్తేనే ప్రతిపక్షాలకు ఫీజులు ఎగిరిపోతాయ‌ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్‌కే. రోజా అన్నారు. ప్లీన‌రీ స‌మావేశాల్లో రోజా మాట్లాడారు. 

 ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు. ప్రజలు మెచ్చిన నాయకుడు, విధికి కూడా తలవంచని వాడు, తలెత్తుకుని తిరిగే వీరుడు మన జగనన్న, అలాంటి జగనన్న కన్న విజయమ్మ గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. 

  ఈ జనసందోహం చూస్తుంటే.. ఇది ప్లీనరీలా కనిపించడం లేదు. రెండేళ్ళ తర్వాత జగన్ అనే నేను.. అంటూ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ గారు చేయబోయే ప్రమాణస్వీకారానికి రిహార్సల్ గా కనిపిస్తోంది.

  దివంగత మహానేత వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ గారు.. ఆరోజు నుంచి ఈరోజు వరకు ఎత్తిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను దించకుండా, ఒక పోరాట యోధుడిలా పార్టీని నడిపిస్తున్నందుకు ప్రతి కార్యకర్తకూ గర్వంగా ఉంది. 

  వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని పార్టీల లాంటిది కాదు. భిన్నమైన రాజకీయ పార్టీ ఇది. భారతదేశ రాజకీయాలను శాసించిన సోనియా గాంధీనే గడగడలాడించిన పార్టీ. వెన్నుపోటు వీరుడు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టించిన పార్టీ. ఒక అసాధారణమైన పరిస్థితుల్లో ఆవిర్భవించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. 

  12 ఏళ్ళ ముందు మహానేత వైఎస్ఆర్ గారిని కోల్పాయాం. రాజకీయాలకు రాజసం నేర్పిన నాయకుడు రాజశేఖరరెడ్డిగారు. రాజ్యాధికారానికి మానవత్వం అద్దిన నాయకుడు వైఎస్ఆర్, రాయలసీమ గడ్డ మీద పుట్టి, భరతమాత గడ్డ మీద కీర్తి గడించిన తెలుగు బిడ్డ వైఎస్ఆర్ గారు.  12 ఏళ్ళ క్రితం మరణించినా.. మరో 12 దశాబ్దాల పాటు ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న నాయకుడు వైఎస్ఆర్ గారు.
- అలాంటి శక్తివంతమైన వైఎస్ఆర్ గారు హెలికాఫ్టర్ ప్రమాదంలో కనిపించకుండా పోయిన రోజు.. శత్రువులు సైతం కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆ మహానేత జయంతి సందర్భంగా ఘన నివాళులు. ఆయన ఆశయాలకు మనమంతా పునరంకితం కావాలి. 

 ఆ మహానేత రాజశేఖరరెడ్డిగారు మరణించిన తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగనన్న, ఒక పోరాట యోధుడిలా పోరాడి, ఈరోజు విజేతలా మనందరి ముందు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 
- భారతదేశంలోనే అతి పెద్ద పార్టీల్లో ఒకటిగా 22 ఎంపీ స్థానాలను సాధించిన జగనన్నకు మనమంతా చేతులెత్తి నమస్కారాలు చెప్పాలి..

  జగనన్న నాయకత్వ పటిమను చూసి.. స్వర్గంలో ఉన్న వైఎస్ఆర్ గారు సైతం.. అదిగో నా బిడ్డ.. అదిగో నా వారసుడు.. అదిగో నా రక్తం.. అని గర్వంగా చెప్పుకుంటారు.  వైఎస్ఆర్ గారి పాదాల చెంత ఎగిరిన జెండాను ఈరోజు వరకూ ఎగిరే విధంగా ఉంచిన దమ్మున్న నాయకుడు జగన్ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా జగనన్న ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శం . ఆ జెండాలో పౌరుషం, ప్రణాళిక, మనందరి భవిష్యత్తు ఉంది. ఆ జెండా ఎప్పటికీ తలెత్తుకుని ఎగురుతూనే ఉండాలి. 

 జగన్ గారిని చూస్తే.. కాన్ఫిడెన్స్ కు కటౌట్ వేస్తే.. ఎలా ఉంటుందో అలా ఉంటారు
- జగనన్న ను చూస్తే.. కమిట్ మెంట్ కు కలర్స్ వేస్తే.. ఎలా ఉంటుందో అలా ఉంటారు
- జగనన్న కటౌట్ చూస్తేనే ప్రతిపక్షాలకు ఫీజులు ఎగిరిపోతాయి
- జగనన్న కంటెంట్ చూస్తే ప్రతిపక్షాలకు ప్యాంట్లు తడిసిపోతాయి. 
- వైఎస్ఆర్ గారి ఆశయం కోసం, ఆయన పేరు నిలబెట్టడం కోసం ఎన్నో కేసులు, అక్రమ నిర్భందంతో ఎన్ని అవరోధాలను ఎదుర్కొన్నారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. 
- ఆకలితో వేటాడే పులిని.. ఆవేశంతో వేటాడే పులిని.. ఆధిపత్యం కోసం వేటాడే పులిని చూసి ఉంటారు. ఆశయం కోసం వేటాడే పులిని.. మీరు ఎప్పుడైనా చూశారా.. ఆ పులే ఈ పులివెందుల బిడ్డ జగన్ మోహన్ రెడ్డిగారు.
- నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్ముకున్న ప్రజల కోసం.. ఎంత దూరమైన వెన్ను చూపకుండా పోరాడే ఒకే ఒక్క నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారు. 

  పార్టీ పెట్టినప్పటి నుంచీ  ఆయన వెనుక ఒక కార్యకర్తగా నడుస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను.  మన పార్టీ సాధించినన్ని విజయాలు, చేసిన పోరాటాలు.. ఈ దేశంలో ఏ పార్టీ కూడా చేయలేదు. దీనికి కారణం మన లీడర్.. మన క్యాడర్.

 జగనన్న రాజకీయ ప్రస్థానం చూస్తే.. చూడటానికి సింపుల్ గా ఉంటారు గానీ, బయటకు వస్తే.. జన ప్రవాహంతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్ళు  పరిగెత్తిస్తారు. తన 12 ఏళ్ళ ప్రస్థానంలో 9 ఏళ్ళు పోరాటాలు చేయడంలో రికార్డు సృష్టించారు జగన్ మోహన్ రెడ్డిగారు. 

  గడప గడపకు ప్రభుత్వం అని జగనన్న ఎమ్మెల్యేలను పంపితే.. కాలర్ ఎగిరేసి, ధైర్యంగా ప్రతి గడప వద్దకు వెళుతున్నామంటే అందుకు కారణం జగన్ మోహన్ రెడ్డిగారు.
- జగనన్న ప్రభుత్వంలో మహిళా సాధికారత కోసం చేస్తున్న కృషిని చూసి గర్వపడుతున్నాను. మహిళా సాధికారత తీర్మానానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ, ఇలానే  కొనసాగాలని కోరుకుంటున్నాను. 
- అలానే, జగనన్న కూతురు వైఎస్ హర్షా రెడ్డి లండన్ లోని ప్రఖ్యాత యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పొందినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. 

  ముఖ్యమంత్రి జగన్ గారికి ఆడబిడ్డల పట్ల ఎంత బాధ్యతగా ఉంటారో,  ఎంత గొప్పగా వారి కోసం ఆలోచన చేస్తారో...  తన కడుపున పుట్టిన ఆడబిడ్డలు ఎంత గొప్పగా చదువుకోవాలి, ఎంత గొప్పగా గౌరవం పొందాలని కోరుకుంటారో, అలానే రాష్ట్రంలోని  ప్రతి ఆడ బిడ్డా అంత గొప్పగా ఉండాలని కోరుకునే నాయకుడు జగన్ గారు.

  మూడేళ్ళలో జగన్ గారి పరిపాలనను మూడు ముక్కల్లో చెప్పాలంటే.. మహిళా సాధికారత కు స్పెల్లింగ్, మహిళా రక్షణకు అబ్జర్వేషన్, మహిళా ఆత్మ గౌరవానికి అడ్రస్ ఎలా ఉంటుందో .. ఆ విధంగా మూడేళ్ళ పాలన ఉంది. ఇంత సుదీర్ఘ ప్రస్థానంలో బాధను, గాయాన్ని తట్టుకునే మనసు అమ్మకు మాత్రమే ఉంటుంది. అమ్మ మనసు ఎంత గొప్పదో.. జగనన్న మనసు కూడా అంతే గొప్పది.

 జగన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున, ఆ బిడ్డ పడిన కష్టం చూసి,  ఆ రోజు కన్నీళ్ళు పెట్టి విజయమ్మ గారి  కన్నీళ్ళు ఎలా తుడిచారో.. ఈరోజు రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ కష్టాన్ని దూరం చేసే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, వారి కన్నీళ్ళు తుడుస్తున్నారు జగన్ మోహన్ రెడ్డిగారు. 
- డాక్టర్ బీఆర్ ఆంబ్కేడర్ ఆశయాలకు అనుగుణంగా మహిళా సాధికారత ఎలా ఉంటుందో.. దేశానికే చాటి చప్పిన నాయకుడు జగన్ గారు.
- తన సుదీర్ఘ పాదయాత్రలో కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకున్నా.. వంటి మీద కత్తి దిగినా బాధపడలేదు గానీ.. ఆడబిడ్డల కష్టాలను చూసి  జగనన్న చలించిపోయారు. 

 ఆడ బిడ్డలకు అమ్మ జన్మ నిస్తే.. వారికి జీవితం ఇచ్చినట్టు ఉంది జగన్ గారి పరిపాలన. అమ్మను మించిన దైవం లేదంటారు.. జగనన్నను చూస్తే, అన్నను మించిన ధైర్యం లేదని నేను అంటాను. 
- ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఇచ్చిన పదవులు, మహిళలకు దక్కుతున్న రక్షణ , గౌరవం .. దేశంలో మరే రాష్ట్రంలో అయినా చూశారా..?. మనసున్న నాయకులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు. 

 తెలంగాణలో జరిగిన ఒక సంఘటనకు చలించిపోయి జగన్ గారు ఏపీలో దిశ చట్టాన్ని రూపకల్పన చేశారు. మహిళలకు ప్రతి దశలోనూ అండగా ఉండేందుకు,  కామాందుల నుంచి ఆడబిడ్డలను కాపాడేందుకు దిశ తెచ్చారు. దిశ పేరులోనే గొప్పతనం ఉంది. 
-  ఈ చట్టం స్పూర్తితో తప్పు చేసినవాడిని శిక్షించడమే కాకుండా, ఆడబిడ్డలను రక్షించేందుకు దిశ యాప్ ను తీసుకొచ్చాం. ఇది ఆడబిడ్డల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. 
- ఆ చట్టం స్ఫూర్తిని పోలీసు శాఖలో నింపి అనేక మార్పులు తెచ్చారు. మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి 7 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి, చార్జిషీటు దాఖలు చేస్తున్న ఘనత మనదే. బాధితులకు కొండంత అండగా ఈ చట్టం ఉపయోగపడుతుంది. 
- దిశ యాప్ ను కోటి 29 లక్షల 87 వేల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ వల్ల.. 5 నుంచి పది నిమిషాల్లో మహిళలకు రక్షణ కలుగుతుంది. 
- దిశ చట్టం కింద నమోదైన కేసుల్లో...  97.68 శాతం కేసుల్లో దర్యాప్తు పూర్తైంది. ఆడపిల్లలను రక్షించడంలో ముఖ్యమంత్రి జగనన్నకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుంది..

 చంద్రబాబు హయాంలో 2014- 19 వరకు ఎస్సీ, ఎస్టీలపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించి బాధితులకు అందాల్సిన పరిహారం కూడా అందకపోవడం సిగ్గుచేటు. జగనన్న ప్రభుత్వం వచ్చాక, ఈ మూడేళ్ళలోనే రూ. 120 కోట్లు ఎస్సీ, ఎస్టీ బాధితులకు పరిహారంగా ఇచ్చాం.  
- అ అంటే అమ్మ.. ఆ అంటే ఆంధ్రప్రదేశ్.. అనేవాళ్ళు... ఇప్పుడు అ అంటే అన్న.. ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తూ ఉంటే.. గర్వంగా ఉంది. 
- ఆడబిడ్డల కోసం ఇంత చేస్తున్న  జగనన్నను ఉన్మాది అని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబును మించిన ఉన్మాది దేశంలో ఎవరైనా ఉన్నారా.. అంటే ఎవరూ ఉండరు. 
- తహసీల్దార్ వనజాక్షిని ఇసుక మాఫియా డాన్ చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టుకుని కొడితే.. కళ్ళప్పగించి చూసిన ఉన్మాది బాబు. 
- పెందుర్తిలో దళిత మహిళ దుస్తులు ఊడగొట్టి కొడితే.. పట్టించుకోని ఉన్మాది  చంద్రబాబు
- బుద్దా వెంకన్న లాంటి వాళ్ళు కాల్ మనీ రాకెట్.. పేరుతో ఆడబిడ్డల జీవితాలను నాశనం చేస్తుంటే.. పట్టించుకోని ఉన్మాది చంద్రబాబే..

 జగనన్నను భయపెట్టాలని, రాష్ట్రం నలుమూలల నుంచి దొంగలంతా ఒకచోటికి చేరి మీటింగులు పెడుతున్నారు. జగనన్నను భయపెట్టాలంటే మీరు మరో జన్మ ఎత్తాలి.
- గత ఎన్నికల్లో జగన్ గారు ముఖ్యమంత్రి కాలేడు అన్న...  పవన్ కల్యాణ్ ను శాసన సభ గేటు కూడా తాకనివ్వకుండా చేశారు. 
- చంద్రబాబు, పవన్ లకు దమ్ము, ధైర్యం ఉంటే.. వారిలో ఆంధ్రప్రదేశ్ రక్తమే ప్రవహిస్తుంటే.. విడివిడిగా జగనన్నతో పోటీకి వస్తారా..
- ఒక పార్టీకేమో పోటీ చేయడానికి క్యాండేట్లు లేరు.. మరోపార్టీ నాయకుడు రెండు చోట్ల పోటీ చేస్తే.. రెండు చోట్లా ఓడిపోయాడు. 
- టీడీపీని చూస్తే.. ఈ జంబలకడి పంబ పార్టీ ఏమిటి.. అనిపిస్తోంది. ఆ పార్టీలో ఆడవాళ్ళు తొడలుగొడతారు.. మగవాళ్ళు ఏడుస్తారు..
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు తొడగొడితే.. చంద్రబాబు గుండె ఆగిపోతుంది. 
- తెలుగుదేశం, జనసేన పార్టీలు అయినా.. డైరెక్ట్ గా ఫైట్ చేయాలిగానీ.. గుంపులు గుంపులుగా వస్తే.. వాళ్ళు లీడర్లు అనిపించుకోరు. 
- ఒకాయన కొడుకును గెలిపించుకోలేదు. మరోకాయన రెండు చోట్ల ఓడిపోయాడు. 
- 2024 ఎన్నికల్లో జగనన్న వన్స్ మోర్.. అన్న నినాదంతో.. 175కు 175 సీట్లు గెలిపించాలి.. 

Back to Top