రాష్ట్రాన్ని ప్రగతి పథంలో న‌డిపిస్తున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి

విశాఖ‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభివృద్ధి – సంక్షేమం అనే రెండు చక్రాల మీదుగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్తున్నారని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోమ‌వారం ఆయ‌న విశాఖపట్నంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా గ్రాండ్ బే హోటల్ లో వై వి సుబ్బారెడ్డి ని ఏపీ కళింగ వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పద్మావతి, పార్టీ నేత‌లు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.ఈ సందర్భంగా  వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ పటిష్టతకు మరింత కృషి చేయాలని పార్టీ శ్రేణుల‌కు సూచించారు. కోవిడ్‌ సంక్షోభంలో దేశం గర్వించేలా రాష్ట్రంలో పాలన సాగుతోందని అన్నారు.  వైయ‌స్‌ జగన్‌ అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం అవినీతి మయంగా ఉండిందని, ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి.. మొక్కవోని ధైర్యంతో అడుగులు ముందుకేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటూ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. 

Back to Top