కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా ఉగాది వేడుక‌లు

వైయ‌స్ జగన్‌ మళ్లీ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు

పంచాంగ పఠనం చేసిన ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నూరి నారాయణమూర్తి వెల్లడి.

తాడేప‌ల్లి:    వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక  ప్ర‌త్యేక పూజ చేశారు. అనంతరం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నూరి నారాయణమూర్తి, ఈ ఏడాది పంచాంగం, రాశి ఫలాలు వినిపించారు.
    మిధున రాశి వారికి ఈ సంవత్సరమంతా మంచి జరుగుతుందని, అదే మిధున రాశిలో జన్మించిన వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి కూడా మళ్ళీ మంచి రోజులు వస్తాయని పంచాంగ పఠనం చేసిన బ్రహ్మశ్రీ సూరి నారాయణమూర్తి వెల్లడించారు. జగన్‌ మళ్ళీ విజయ దుందుభి మోగిస్తారని, శ్రీ కృష్ణదేవరాయలులాగా ఆయన చరిత్రలో నిల్చిపోతారని చెప్పారు. ఓడిపోతే ఎవరైనా ధైర్యం కోల్పోతారని, భయపడతారని.. కానీ తిరుగులేని నాయకత్వ లక్షణాలు, అంతులేని ప్రజాదరణ కలిగిన జగన్‌ ఏనాడూ వెనక్కు తగ్గబోరని తెలిపారు. ఆయన రాశిఫలంలోనూ అదే ఉందని అన్నారు. సాంఘికంగా కూడా ఎంతో ఔన్నత్యాన్ని పొందే వైయ‌స్ జగన్, మళ్లీ తప్పనిసరిగా విజయం సాధిస్తారని, కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని బ్రహ్మశ్రీ సూరి నారాయణమూర్తి స్పష్టం చేశారు. వైయ‌స్ జగన్‌ అఖండ విజయం తథ్యమని ఆయన వివరించారు.


    వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర కార్యాలయ ఇన్‌ఛార్జ్‌ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ నేత వేమారెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పుత్తా శివశంకర్‌రెడ్డి, అంకంరెడ్డి నారాయణమూర్తి ఇంకా పలువురు పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Back to Top