సీఎం వైయస్‌ జగన్‌ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు

తాడేపల్లి: ప్రజా సంకల్పయాత్ర చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు అన్నారు. ప్రజా సంకల్పయాత్ర రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, ఎమ్మెల్యే సుధాకర్‌బాబు కేక్‌కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం వైయస్‌ జగన్‌ పాదయాత్ర ఒక చరిత్ర అన్నారు. దేశ చరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేశారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఐదు నెలల్లోనే అమలు చేసి చూపించారన్నారు. పాదయాత్ర చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుందన్నారు. 

Read Also: పాదయాత్ర రాష్ట్ర చరిత్రను తిరగరాసింది

Back to Top