తూర్పుగోదావరి: . మత్స్య దినోత్సవం సందర్భంగా వైయస్‌ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ముమ్మడివరం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సముద్రంలో వేట నిషేధం సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.4 వేలు చెల్లించేది. దీనిని ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.10 వేలకు పెంచింది. ఈ పథకాన్ని సీఎం వైయస్ జగన్ వైయస్‌ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. ఈపథకం ద్వారా వేటనిషేధ పరిహారం రూ.10,000,డీజిల్ సబ్సిడీ రూ.9కి పెంపు, వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి రూ.10లక్షల పరిహారాన్ని అందిస్తారు. కాగా పథకంతో రాష్ట్రంలోని 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో కల్పించడానికి బడ్జెట్‌లో మత్స్య శాఖకు రూ.551 కోట్లు కేటాయించింది. Read Also: ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా శ్రీనాథ్‌రెడ్డి బాధ్యతలు