తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్ భారీ దోపిడీకి తెర లేపిందని వైయస్ఆర్‌సీపీ ఆరోపించింది. టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బినామీలకే మద్యం దుకాణాలను కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారని కామెంట్స్ చేసింది. వైయస్ఆర్‌సీపీ ట్విట్టర్ వేదికగా.. టీడీపీ భారీ దోపిడీకి తెర! రాష్ట్రంలో మద్యం దందా ద్వారా అధికారికంగా భారీ దోపిడీకి తెర లేపిన టీడీపీ. ముఖ్య నేత కనుసన్నల్లో జరుగుతున్న దుకాణాల కేటాయింపుల్లో టీడీపీ సిండికేట్‌కు రాచబాట పరుస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బినామీలకే మద్యం దుకాణాలను కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారు అని ఆరోపించింది.