సహాన మరణ వార్తపై వైయ‌స్‌ జగన్‌ విచారం

మధిర సహాన కుటుంబ స‌భ్యుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేతల ప‌రామ‌ర్శ‌
 

గుంటూరు: టీడీపీ రౌడీషీటర్‌ నవీన్‌ దాడిలో గాయపడి మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన మధిర సహాన చివరకు ఓడిపోయింది.  సహాన మరణ వార్తపై వైయ‌స్‌ జగన్‌ విచారం వ్య‌క్తం చేసిన‌ట్లు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు తెలిపారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సహాన మరణంపై సమాచారం అందుకున్న వైయ‌స్ఆర్‌సీపీ మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ మనోహర్ నాయుడు, నూరి ఫాతిమా, డైమండ్ బాబు యువతి కుటుంబాన్ని పరామర్శించారు.

అనంతరం మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. ‘ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. సహన విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నారో అందరూ చూస్తున్నారు. అక్కడి మంత్రి ఏమైపోయారు. ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. దిశ యాప్ లేకపోవటం వల్లే రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. సహాన మరణ వార్తపై వైయ‌స్‌ జగన్‌ విచారం వ్యక్తం చేశారు. రేపు (బుధవారం)సహన కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు’ అని  అన్నారు.  

సహానా మరణంపై మాజీ మంత్రి విడదల రజిని విచారం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇందుకు సహానలాంటి ఘటనలే నిదర్శనం. సహాన శరీరంపై గాయాలున్నాయి. బయటకు చెప్పుకోలేని అభద్రతాభావంలో సహన తల్లిదండ్రులు ఉన్నారు. మహిళలకు రక్షణ లేదన్న భావన వ్యక్తం అవుతోంది. దిశ లాంటి చట్టాలను వైయ‌స్‌ జగన్‌ హయాంలో తీసుకొచ్చారు. దిశ లాంటి చట్టాల అవసరం ఉంది. మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.  

స‌హ‌న మృతి చెంద‌డం బాధాక‌రం: ఆర్కే రోజా

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న సహన మృతి చెందడం బాధాకరం. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న జిల్లాలో,  మహిళ హోంమంత్రి గా ఉన్న ఈ రాష్ట్రంలో టీడీపీ రౌడీ షీటర్ కిరాతకంగా దాడి చేసి సహానా ను హత్య చెయ్యడం దారుణం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య. ఈ హత్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి లే బాధ్యత వహించాలి. మూడు రోజులుగా మృత్యువుతో పోరాడిన సహాన కి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ వెళ్లి వైద్యులను అదేశించకపోవడం అమానవీయం. ఇంకా ఎంత మంది అడబిడ్డలను బలి తీసుకుంటారు..?  టీడీపీ నేతలు, రౌడీ షీటర్ల నుండి మహిళల మాన, ప్రాణాలను ముప్పు ఉంది. తక్షణమే సహానా ను హత్య చేసిన టీడీపీ రౌడీ షీటర్ నవీన్ ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నా.  రియాలిటీ షో కి వెళ్లి వినోదం పొందిన సీఎం చంద్రబాబు ఇప్పుడు సహాన తల్లి కన్నేటికి ఏం సమాధానం చెప్తారు..? సహాన ఆత్మ శాంతించాలని భగవంతుడిని కోరుకుంటున్నాన‌ని ఆర్కే రోజా త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
 

 
Back to Top