అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒక్కటేనని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఇసుక పేరుతో చంద్రబాబు దొంగ దీక్ష చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీని కాపాడుకునేందుకు చంద్రబాబు ఫీట్లు చేస్తున్నారని అన్నారు. గత పాలనలో టీడీపీ నేతలే ఇసుకను అడ్డగోలుగా దోచేశారని ధ్వజమెత్తారు.రాజకీయల లబ్ధి కోసమే చంద్రబాబు దీక్ష చేస్తున్నారని విమర్శించారు. Read Also: ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ స్కూల్స్ తీర్చిదిద్దుతాం