అమరావతి: తనపై ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. తాను దళిత డాక్టర్‌ని అని, ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ.. నిజానిజాలు తెలుసుకోకుండా ఏబీఎన్ రాధాకృష్ణ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌పీ రేటింగ్ కోసం ఎల్లోమీడియా దిగజారుతోందన్నారు.