ఆ ఘనత వైయస్‌ఆర్‌ కుటుంబానికే సొంతం

శాసన మండలి చైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌

నామినేషన్‌ దాఖలు చేసిన వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ మోషేన్‌రాజు

సచివాలయం: ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి చైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్‌ రాజు మండలి చైర్మన్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి పి. బాలకృష్ణమాచార్యులుకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. రేపు శానస మండలి చైర్మన్‌ ఎన్నిక జరగనుంది. నామినేషన్‌ అనంతరం ఎమ్మెల్సీ మోషేన్‌రాజు మీడియాతో మాట్లాడుతూ.. కష్టపడి పనిచేసే కార్యకర్తకు అత్యున్నత పదవులు ఇచ్చే మనసు మహానేత వైయస్‌ఆర్‌ కుటుంబానికే ఉందన్నారు. వైయస్‌ఆర్‌ సీపీకి, సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞుడిగా ఉంటానన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, మహిళలకు 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. 
 

Back to Top