అగ్ని ప్ర‌మాదంపై సీఎం వైయ‌స్ జగన్ మానవతా దృక్పథంతో స్పందించారు

 వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి

మ‌త్స్య‌కారుల క‌ష్టాలు  తెలుసుకోవాలని సీఎం పంపించారు 

ప్రమాద కారకులపై  ప్ర‌భుత్వం చర్యలు తీసుకుంటుంది

విశాఖ‌: విశాఖ షిప్పింగ్ హార్బర్ వద్ద జరిగిన బోటు అగ్ని ప్రమాదంపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాన‌వ‌తా దృక్ప‌థంతో స్పందించార‌ని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మంగ‌ళ‌వారం వైవీ సుబ్బారెడ్డి బాధితులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సంద‌ర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అగ్ని ప్ర‌మాదంపై ప్రభుత్వం..అధికార యంత్రాంగం స‌కాలంలో స్పందించడంతో హార్బర్ లో ప్రమాద తీవ్రత తగ్గింద‌న్నారు. పోర్ట్..స్టీల్ ప్లాంట్..పోలీసులు సకాలంలో స్పందించార‌ని అభినందించారు. కాస్త ఆల‌స్య‌మై ఉంటే ఆయిల్ ట్యాంకర్ ల నుంచి ముప్పు వుండేదన్నారు. బోటు ఖరీదు రూ.30..50 లక్షలు అయినా అందులో 80 శాతం ప్రభుత్వం భరిస్తుంద‌న్నారు. పాక్షికంగా దెబ్బ తిన్న బోటు యజమానులకు మేలు చేస్తామ‌న్నారు. పరిహారం గతం మాదిరిగా ఆలస్యం కాకుండా రోజుల వ్యవధిలో అంద‌జేస్తామ‌న్నారు. మునిగిపోయిన బోట్ల ను తొలగించాలని పోర్ట్ అధికారులను కోరామ‌ని చెప్పారు. ఇతర బొట్లకు అడ్డం లేకుండా మునిగిన బోట్లను త్వరలో బయటకు తీస్తామ‌ని హామీ ఇచ్చారు. కేవలం పరిహారం మాత్రమే కాదు ఇతర సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామ‌ని భ‌రోసా క‌ల్పించారు. ప్రమాద కారకులపై  ప్ర‌భుత్వం చర్యలు తీసుకుంటుంద‌న్నారు.  సీసీ కెమెరాలు ఎందుకు పని చేయలేదన్న విషయంపై విచారణ చేపట్టాలని సీపీని కోరామ‌న్నారు. టిడిపి హయాంలో హుడ్ హుడ్.. తిత్లి మాదిరిగా ఆలస్యం లేకుండా పరిహారం అందిస్తామ‌ని వైవీ సుబ్బారెడ్డి స్ప‌ష్టం చేశారు.
 

Back to Top