సంపద సృష్టి చంద్రబాబు కుటుంబానికే..రాష్ట్రానికి కాదు

 అదే ఏడీఆర్‌ రిపోర్ట్‌ తేల్చింది

వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి సృష్టీక‌ర‌ణ‌

చంద్రబాబు ఆస్తులు నెలనెలా లెక్కించాలేమో

ఆరు నెలల అవినీతి పాలన చూస్తే అదే అనిపిస్తుంది

రోజురోజుకీ రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోతోంది

మరోవైపు చంద్రబాబు ఆస్తులు దూసుకెళ్తున్నాయి

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పూర్తిగా ముంచాలన్నా..

సొంత ఆస్తులు పెంచుకోవాలన్నా చంద్రబాబుకే సాధ్యం

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన పుత్తా శివశంకర్‌రెడ్డి

తాడేపల్లి: రాష్ట్రం ఒక పక్క అప్పుల్లో కూరుకుపోతుంటే, మరోవైపు సీఎం చంద్రబాబు ఆస్తులు మాత్రం రాకెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపించారు. తాజాగా అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) నివేదికలో ఈ విషయం తేటతెల్లమైందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఆరు నెలల అవినీతి పాలన చూస్తుంటే, చంద్రబాబు ఆస్తులను నెలనెలా లెక్కించాల్సి వస్తుందేమో అని ఆయన అభిప్రాయపడ్డారు.

పుత్తా శివశంకర్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ పాయింట్స్‌: 
– అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (ఎన్‌ఈడబ్ల్యూ) సంయుక్తంగా దేశంలోని 31 రాష్ట్రాల (కేంద్ర పాలిత ప్రాంతాలు సహా) ముఖ్యమంత్రుల ఆస్తులపై సర్వే నిర్వహించి నివేదిక విడుదల చేశాయి.
– ఆ నివేదిక ప్రకారం చంద్రబాబు దేశంలోనే ధనిక సీఎంగా నిలిచారు. 31 రాష్ట్రాల సీఎంల ఆస్తులన్నీ కలిపి రూ.1,630 కోట్లు కాగా, ఒక్క చంద్రబాబు ఆస్తులే రూ.931 కోట్లు అని ఆ నివేదిక వెల్లడించింది.   
– చంద్రబాబు ఒక్కరి ఆస్తి విలువే.. మిగిలిన అందరి సీఎంల ఆస్తుల్లో 58 శాతం ఉందంటే, ఆయన ఏ స్థాయిలో ఆస్తులు పోగేశాడన్నది అర్థమవుతుంది.  
– అఫిడవిట్‌లో చూపించిన ప్రకారం చంద్రబాబు ఆస్తులు రూ.931 కోట్లు అని సంస్థ ప్రకటించినా, వాస్తవానికి మార్కెట్‌ లెక్కల ప్రకారం ఆ విలువ లక్ష కోట్లకు పైగానే ఉంటుంది.  
– నిన్నటి దాకా రాష్ట్రం అప్పుల్లో ఉందని, చంద్రబాబు చేతికి వాచీ లేదని ఊదరగొట్టిన ఎల్లో మీడియా, చంద్రబాబుని దేశంలోనే ధనిక సీఎంగా ఏడీఆర్‌ ప్రకటిస్తే, కనీసం ఆ వార్తను ప్రచురించలేదు. చంద్రబాబు బిలియనీర్‌ అని తెలిస్తే జనం ఛీకొడతారని వారి భయం.

– రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచాలన్నా, తన ఆస్తులు వేగంగా పెంచుకోవాలన్నా అది ఒక్క చంద్రబాబుకే సాధ్యం. కూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ సంస్థ షేర్లు ఒక్కరోజులోనే భారీ వృద్ధి రేటు నమోదు చేశాయి. 
– రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని ఎన్నికల ముందు, ఆ తర్వాత చంద్రబాబు పదే పదే చెబుతుంటే.. అది రాష్ట్ర సంపదేమోనని అందరూ అనుకున్నారు. కానీ, హెరిటేజ్‌ షేర్లు, ఏడీఆర్‌ ప్రకటించిన ఆయన ఆస్తులు చూస్తుంటే.. చంద్రబాబు ఈ రాష్ట్రానికి కాకుండా, కేవలం తన కుటుంబానికే సంపద సృష్టించుకుంటారని స్పష్టంగా తేలింది.
– చేతికి వాచీ లేదు. వేలికి ఉంగరం లేదు. జేబులో డబ్బుల్లేవని చెప్పే చంద్రబాబు మాటలన్నీ.. కేవలం ప్రజలను మభ్య పెట్టడానికే అని పుత్తా శివశంకర్‌రెడ్డి అన్నారు.

Back to Top