డెయిలీ కరపత్రాలు..తిమిర కిర‌ణాలు

ఆబద్దాల‌ను నిజమని చెబుతూ భ్ర‌మ‌ల్లో ముంచెస్తున్న దేశం భ‌క్తులు

త‌న బాబు తప్పులు చేసినా మహా దేశం భక్తుడంటూ కరపత్రం సైజులు పెంచి మరీ పంచేస్తారు

అమ‌రావ‌తి:  మా ఊర్లో ఓ తాత వున్నాడు. భలే కిలాడీ అప్పా. ఊరగాయలు కొనని కాలంలోనే కొనేటట్టు చేసినాయన. చిట్టీలేస్తానంటూ జనం డబ్బులతో తన వ్యాపారాలను పెంచుకున్నవాడు. ఇలా ఒకటేమిటి...రకరకాలు పనులు చేసి...వూర్లో అన్నీ తానే అయ్యాడు. అందరి మౌత్‌ వాయిస్‌ ఆయనే అయిపోయాడు. ఆయనగారికి పెద్దపెద్ద మనవరాళ్లు కూడా వున్నారు. యువకుడి దశ నుంచి తాత దశ వరకూ వయసు పెరిగిపోయినా...ఆయన బుద్ది మాత్రం మారలేదు. మాటలతో బోల్తా కొట్టించడం ఆయనకే తెలుసు. ఇది చాలదన్నట్టు ఆయన కరపత్రం స్పెషలిస్ట్‌. జనాల్ని నమ్మించడానికి..తాను ఆబద్దాలు చెప్పినా నిజమని భ్రమించడానికి ...డెయిలీ కరపత్రాలు కూడా ముద్రేసి వూర్లో పంచేరకం. మొత్తానికి బోలెడు ఆస్తి పోగేశాడు. ఇంకా వేస్తూపోతూనే వున్నాడు. అయినా, మనిషి మాత్రం మారలేదు. బుద్ది మారలేదు. అదేదో పుట్టుకతో వచ్చిన బుద్ది పుడకలతో గానీ పోదన్నట్టుగా...ఆయన మారలేదు గాక మారలేదు. మనిషిలోపలంతా పచ్చ రంగయినా, పైకి మాత్రం తెల్లబట్టలేసుకుని తిరుగుతుంటాడు. 

తను వెనకేసుకొచ్చేవాడు దొంగయినా, వెన్నుపోటుదారుడయినా, కుట్రలు కుతంత్రాలు చేస్తూపోయినా, ప్రజలకు అది చేస్తా, ఇది చేస్తా అని హామీలిచ్చి...చేయకపోయినా...వాటి విషయంలో ఏరోజూ కరపత్రంలో రాసిన పాపాన పోలేదు. పైగా ...అలాంటివన్నీ ఊర్లోవాళ్లకు చేరిపోతుంటే...తెలిసిపోతుంటే...కవరింగ్‌ చేస్తూ.. తప్పుల చేసినాయన మహా దేశం భక్తుడంటూ కరపత్రం సైజులు పెంచి మరీ పంచేస్తాడు. ఇది చాలదన్నట్టు ...తన సపోర్ట్‌ చేసే బాబును అడ్డంగా పట్టుకుని, నిలదీసిన వారిపైన రివర్స్‌లో కరపత్రాలు రిలీజ్‌ చేస్తాడు. ఏవైతే తన ముద్దుల బాబు చేశాడో...ఆ చీకటిపనుల్ని, ప్రజాద్రోహాల్ని అన్నింటిని నిలదీసిన వారికి అడ్డగడుతూ కరపత్రాలు నింపేస్తాడు. ఈ తాతయ్యకు వారసుడిలా ఇంకో ఆయనా బయలు దేరాడు. ఈయనది తాతయ్య బుద్దే. బ్లాక్‌లో కిరసనాయిలు అమ్మిన బ్యాక్‌గ్రౌండ్‌. డొక్కు సైకిలేసుకుని కెరీర్‌ మొదలు పెట్టిన గ్రేటర్‌ కిలాడి. ఇక చూస్కోండి. ఇప్పుడు ఊరిమీద ఇద్దరూ పడి..దొంగబాబును వెనకేసుకొస్తూ..ఉల్టా రాతలు రాస్తూ తమతమ కరపత్రాలు పంచుతున్నారు. జనం తమ బాబును ఛీకొట్టే దాకా వీరు మారరు...మారరు గాక మారరు బాబూ...తాతకు వయసు మీద పడ్డా బుద్ది మారకపోవడం...ఊర్లో జనానికి బోల్డాశ్చర్యం కలిగిస్తూనే వుంది. 
 

Back to Top