తాడేపల్లి: జాబులు పోవాలంటే ఎవరు రావాలి? చంద్రబాబే కదా? అని వైయస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కుపరిపశ్రమలో ఉద్యోగాలు తొలగించడంపై విజయసాయిరెడ్డి శుక్రవారం తన ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. విశాఖ స్టీల్‌లో తొలి విడతగా 4 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారని విజయసాయిరెడ్డి తెలిపారు. ‘జాబ్ పోవాలి అంటే ఎవరు రావాలి? చంద్రబాబే కదా? సంపద సృష్టి, బాబు వస్తే జాబు.. అంటే ఇదేనా తెలుగు తమ్ముళ్లూ? ఇది ప్రైవేటీకరణకు మరో మెట్టు కాదా బాబూ ....చంద్రబాబూ ?’అని విజయసాయిరెడ్డి తన ట్వీట్‌లో ప్రశ్నించారు.