<br/><br/>గుంటూరు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతోంది.ఈ సందర్భంగా దారిపొడవునా ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. అందరి సమస్యలు తెలుసుకుంటున్న వైయస్ జగన్ మరో ఏడాదిలో రాజన్న రాజ్యం వస్తుందని భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో శనివారం (130వ రోజు) ప్రజాసంకల్పయాత్ర శేకూరు శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి సంగం జాగర్లమూడి, అంగలకుదురు, సుల్తానాబాద్‌ల మీదుగా పాదయాత్ర తెనాలి పురవేదిక సెంటర్‌కు చేరుకుంటుంది. ఇవాళ సాయంత్రం తెనాలి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు.