న్యూఢిల్లీ: అమరావతి పర్యావరణ అనుమతులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో మరోసారి పిటిషన్ దాఖలైంది. మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి నిర్మాణానికి ఇచ్చిన పర్యావరణ అనుమతుల్లో నిబంధనలు పాటించలేదని శర్మ ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. సున్నిత పర్యావరణ ప్రాంతంలో విమానాలకు అనుమతికి రాష్ట్ర అథారిటీ లేదని గుర్తుచేశారు. పిటిషనర్ వాదన విన్న ట్రిబ్యునల్ తదుపరి విచారణను పిభ్రవరి 4కు వాయిదా వేసింది. <br/>గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో పర్యావరణ చట్టాలను, నిబంధనలను పాటించడం లేదంటూ పలు పిటిషన్ దాఖలయ్యాయి. పర్యావరణ అనుమతి లేకుండా ఇష్టానుసారంగా అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయరాదని ఎన్టీజీ ఏపీ ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. తాజాగా మరో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది.