<br>హైదరాబాద్) మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని పూజ్య బాపూజీకి ప్రతిపక్ష నేత, వైెఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నివాళి అర్పించారు. స్వాతంత్ర్యోద్యమాన్ని అహింసా మార్గంలో బాపూజీ నడిపించిన తీరు, వ్యక్తిగత జీవితంలో ఆయన పాటించిన విలువలు అందరికీ ఆదర్శనీయం అని అభిప్రాయ పడ్డారు. గాంధీజీ జీవితం, విలువలు సదా స్ఫూర్తి దాయకం అని జగన్ అభిలషించారు.అలాగే నేడు మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు వైఎస్ జగన్ నివాళి అర్పించారు. దేశం కోసం శాస్త్రి పడిన తపన, నిబద్దత అందరికీ ఆదర్శనీయం అని అభిప్రాయ పడ్డారు. </br>