దళితుల నిధులు దారిమళ్లింపుఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులకు చిల్లు బాబు మోసాలపై మండిపడిన ఎస్సీ సెల్ అధ్యక్షులు మేరుగ నాగార్జునహైదరాబాద్: దళితుల నిధుల్ని పక్కదారి పట్టిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం మోసాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు డాక్టర మేరుగ నాగార్జున మండిపడ్డారు. దళితులకు చట్ట ప్రకారం రావాల్సిన నిధులన్నీ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో చంద్రబాబు చేస్తున్న మోసాల్ని ఒక్కొక్కటిగా ఆయన బట్ట బయలు చేశారు. హైదరాబాద్ లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దళితుల సబ్ ప్లాన్ కు సంబంధించిన సమీక్షలో చంద్రబాబు అసత్యాలు ప్రకటిస్తున్నారని నాగార్జున సోదాహరణంగా వివరించారు. 2015..16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రణాళికా వ్యయం 38, 671 కోట్లు ఉంటే.. జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు రూ. 6,613 కోట్లు రావాలని చెప్పారు. కానీ, రూ. 4,045 కోట్లు ఇచ్చి రూ. 2,565 కోట్ల ఎగ్గొట్టారని వివరించారు. అటు ఎస్టీలకు రూ. 2,601 కోట్లు రావాల్సి ఉండగా 1,320 కోట్లు ఖర్చు పెట్టి రూ. 740 కోట్లు ఎగ్గొట్టారని విశ్లేషించారు. దీన్ని బట్టి దళితుల మీద ఏ మేరకు అభిమానం చూపిస్తున్నారు అనేది తెలుస్తోందని నాగార్జున వివరించారు. 2014..15 బడ్జెట్ లో ప్రణాళికా వ్యయం 32, 300 కోట్లుగా చెప్పారని ఇందులో ఎస్సీలకు రూ. 5,596 కోట్లు రావాల్సి ఉండగా, 2,602 కోట్లు ఖర్చు పెట్టి 2,993 కోట్ల మేర ఎగ్గొట్టారని పేర్కొన్నారు. ఎస్టీలకు రూ. 1,400 కోట్లు రావాల్సి ఉండగా 1,100 కోట్లు విడుదల చేసి.. రూ. 302 కోట్లు ఎగ్గొట్టారని లెక్క తేల్చారు. వాస్తవాలు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు డూడూ బసవన్న ల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని నిలదీశారు. దళితుల నిధుల్ని పక్క దారి పట్టించేందుకు జీవో నెంబర్ 23 తెచ్చాని మండిపడ్డారు. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్ ను మూసివేసేందుకు జీవో నెంబర్ 45 తెచ్చారని పేర్కొన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ ను పెట్టినా హాస్టల్స్ ను మూసివేయద్దని తమ నాయకుడు వైఎస్ జగన్ చెప్పారని, ఈ డిమాండ్ ను పరిగణన లోకి తీసుకోవాలిన నాగార్జున పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ లో నలుగురు ఐదుగురు ఎస్సీ అధికారులు సీనియార్టీ జాబితాలో ఉన్నప్పటికీ, అట్టడుగున ఉన్నఅధికారికి ప్రమోషన్ ఇచ్చారని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం పెట్టిస్తామని కబుర్లు చెబుతున్నారని, కానీ అక్కడ దళితుల అసైన్డ్ భూములు లాక్కొన్న చరిత్ర తెలుగుదేశాని ది అని నాగార్జున గుర్తు చేశారు. ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు వాస్తవాలు గమనించాలని హితవు పలికారు. To read this article in English: http://goo.gl/vxsmv0