హోదా కోసం ధైర్యంగా పోరాడుతోంది జగన్‌ ఒక్కరే...

కాకినాడః హోదా కోసం రాజీనామా చేసినందుకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలంతా గర్వపడుతున్నామని వైయస్‌ఆర్‌సీపీ నేత వరప్రసాద్‌ అన్నారు.ప్రత్యేక హోదా కోసం ధైర్యంగా పోరాడుతున్నది వైయస్‌ జగన్‌ ఒక్కరేనన్నారు.కేంద్రంతో పోరాడే ధైర్యం బాబుకు లేదన్నారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిన చ్రరిత చంద్రబాబుకు లేదన్నారు.ప్రతి ఎన్నికల్లో ఎవరో ఒకరి పొత్తు కావాల్సిందేనన్నారు. చంద్రబాబు అబద్ధాలపై పునాదులు వేసుకుని గెలిచారన్నారు. టీడీపీ పాలనలో పదిలక్షల పింఛన్లు తీసివేశారని, పదిలక్షల రేషన్‌కార్డులు తొలగించారన్నారు. మరో 2 లక్షల కాంట్రాక్టు కార్మికులను తీసేశారని, .60 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేశారన్నారు. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని,  ఎన్నికల కమిషన్‌ ప్రకారం దేశంలో అతి ధనవంతుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుని ప్రజలను అధోగతి పాలు చేస్తున్నారన్నారు.చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కులేదన్నారు. ప్రతి వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త చంద్రబాబు మోసాలు ఇంటింటికి తెలియజేయాలని కోరారు.
Back to Top