<br/>హైదరాబాద్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్ర హీనుడని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. పదవుల కోసం తెలుగు జాతిని విడగొట్టాలని లేఖ ఇచ్చిన హీనుడని ఆమె అభివర్ణించారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ నాడు మామ ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర కూడా చంద్రబాబుదే అని ఆమె అన్నారు. విధాన పత్రాల సంగతి తర్వాత కానీ, ముందుగా ముఖ్యమంత్రిగా తన హయంలో జరిగిన అవినీతిపై చంద్రబాబు నాయుడు శ్వేత పత్రం విడుదల చేయాలని రోజా డిమాండ్ చేశారు. గోదావరి పుష్కరాల్లో ఎంత తిన్నారో బయట పెట్టాలని ఆమె అన్నారు. జీవో నెంబర్ 22 ఇచ్చి ప్రాజెక్టుల అంచనాలు పెంచేందుకు ఎంత తీసుకొన్నారో వెల్లడించాలని ఆమె అన్నారు.<br/>