మూడు రోజులుగా సాగిన వైఎస్ జగన్ పర్యటనప్రజలతో మమేకం అయిన ప్రజా నేతస్థానికులతో కలిసిపోయిన వైనం
కడప: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మూడు రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. ఎక్కడికక్కడ ప్రజలతో మమేకం అవుతూ ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకు చొరవ చూపారు.
మొదటి రోజు నియోజక వర్గంలో పర్యటనబెంగళూరు నుంచి రోడ్ మార్గంలో వైఎస్ జగన్ పులివెందులకు ప్రయాణించారు. మార్గ మధ్యలో అనంతపురం జిల్లాలో వేరు శనగ భూముల్ని పరిశీలించారు. రుణ మాపీ పేరుతో ప్రభుత్వం చేసిన మోసాల్ని అక్కడ రైతుల్ని జగన్ దృష్టికి తీసుకొని వచ్చారు. అధైర్య పడవద్దని అక్కడ వారికి జగన్ ధైర్యం చెప్పారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా పులివెందుల లోని క్యాంపు కార్యాలయంలో గడిపారు. సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చిన ప్రజలతో మమేకం అయ్యారు
రెండో రోజు కడపలో పర్యటనరెండో రోజు వైఎస్ జగన్ కడప చేరుకొన్నారు. అక్కడ మంత్రి నారాయణ, ఆయన అనుచరుల అక్రమాలతో కార్పొరేట్ కాలేజీల్లో జరుగుతున్న అరాచకాలమీద పోరాటాన్ని చేపట్టారు. ఇటీవల ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకొన్న ఘటనపై చలించిపోయారు. రిమ్స్ ఆస్పత్రి దగ్గర ఆందోళన చేపట్టారు. అనంతరం పులివెందుల కు తిరిగివెళుతూ స్థానిక దేవాలయంలో పూజలు నిర్వహించారు. వైఎస్ఆర్ సీపీ నాయకుడు సీఆర్ ఐ సుబ్బారెడ్డి మృతదేహానికి అంజలి ఘటించారు.
మూడో రోజు స్థానికులతో మాటా మంతీపులివెందుల నియోజక వర్గ ప్రగతి మీద వైఎస్ జగన్ సమీక్షించారు. స్థానికులతో ఆయన మాట్లాడారు. రాయినాపురం గ్రామానికి చెందని పార్టీ నాయకుడు భాస్కర్ రెడ్డి కుమారుడు సందీప్ కు నందిని తో వివాహం నిశ్చయం అయింది. ఆ జంట వివాహ నిశ్చితార్థానికి వైఎస్ జగన్ వెళ్లి ఆశీర్వదించి వచ్చారు.
ప్రతిపక్ష నేత గా, పార్టీ అధ్యక్షుడుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, ఎప్పటికప్పుడు నియోజక వర్గానికి వచ్చి ప్రజల యోగ క్షేమాల్ని తెలుసుకోవటం వైఎస్ జగన్ కు అలవాటు. ఇదే క్రమంలో ఆయన పులివెందులలో మూడు రోజుల పాటు పర్యటించారు.