పీలేరు (చిత్తూరు జిల్లా): తమను ప్రజా ప్రతినిధులుగా ఎవరూ గుర్తించడంలేదని, ఏ పని కావాలన్నా సర్పంచ్ అనుమతి తీసుకోవాలని చెబుతున్నారని పేర్కొంటూ వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు బుధవారం పీలేరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తమను ప్రజలు ఎన్నుకున్నా తాము చెప్పిన పనులు ఒక్కటీ చేయడంలేదని వారు ఆరోపించారు.<br/>ఎంపీపీ కె. మహిథా ఆనంద్ నాయకత్వంలో జరిగిన ఈ ధర్నాలో వైస్ ఎంపీపీ కంభం సతీష్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ ఎంపీడీవో లీలామాధవికి వినతిపత్రం ఇచ్చారు.