స్పీకర్: శ్రీకాంత్ రెడ్డి - ఏప్రిల్ 11,2012

ముక్యమంత్రి కిరణ్, పి‌సి‌సి చీప్ బొత్స, ప్రతిపక్ష నేత చంద్రబాబు... ఈ ముగ్గురు కుమక్కై రాష్ట్రాన్ని అస్తిరపరచి.. అరాచకం సృస్టిస్తున్నారు అని వైఎస్ఆర్ పార్టీ నేత,
రాయచోటి మాజీ ఎం‌ఎల్‌ఏ శ్రీకాంత్ రెడ్డి విరుచుకు పడ్డారు. వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యలయంలో బుదవారం జరిగిన ప్రెస్ మీట్లో  ఆయన మాట్లాడుతూ .. వీరు ముగ్గురూ 
కలసి రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థనే సంపూర్ణంగా నాశనం చేశారన్నారు. వై ఎస్ వల్ల ఆయన బొమ్మ పెట్టుకొని మేం గెలిచామ్ అని మేం చెబుతున్నాం. ఆయన రెక్కల కష్టం 
మీద వచ్చిన ప్రబుత్వంలో అదికారం అనుభవిస్తూ ... ఇవాళ పదవుల కోసం ఆయన్నే విమర్శిస్తుండడం కంటే నీచం మరోటి ఉండదన్నారు.
 మీకు(కాంగ్రెస్ నేతలు ) సిగ్గు, లజ్జా ఉంటే... మీ పదవులకు రాజీనామా చేసి .. మీరు చెబుతునట్టు సోనియా గాంధీ బొమ్మతో .. గెలవండి ... అని ఆయన సవాల్ విసిరారు ...
 
విజయనగరం జిల్లాలో కుటుంబ పాలన సాగిస్తూ .. జిల్లాను అన్నింటా దోచుకున్న వ్యక్తి పి‌సి‌సి ఛీప్ బొత్స అని విమర్శించారు.. వ్యక్తిగత ప్రయోజనలకోసం ఎన్నికలు వచ్చాయని బొత్స అంటున్నారు .. మీరెన్ని ప్రలోభాలు పెట్టిన ... వాటిని కాలుతో తన్ని రైతులకోసం ..వై ఎస్ కుటుంభం కోసమే తాము రాజీనామాలు చేయవలసి వచ్చిందన్నారు. తెల్లకార్డుదారులకు కూలి డబ్బులు ఇత్ఛి ..వారి పేర్లతో మద్యం వ్యాపారం సాగిస్తూ ..లిక్కర్ మాఫియా డాన్ గా తయారైన బొత్స పి‌సి‌సి అద్యక్షుడుగా ఉండడం కాంగ్రెస్ దౌర్భాగ్యం అన్నారు. తన వ్యాపారం కోసం పదవి కోసం ... డిల్లీ వెళ్ళి వాళ్ళ కాళ్ళు ... వీళ్ళ కాళ్ళూ పట్టుకొని ఏసిబి అదికారిని బదిలీ చేయించింది బొత్స 
కాదా ..? అని ప్రశ్నించారు. వోక్స్ వాగన్ కేసులో .. సొమ్ములు ఎటు పోయాయో .. నాకేం తెలుసు అన్నది బొత్స కాదా .... దళిత ఎం‌ఎల్‌ఏ లను భయభ్రాంతులకు గురి 
చేసి ...అనేక ప్రలోభలకు గురి పెట్టింది బొత్స కాదా అని ప్రశ్నించారు.  ఒక  వైపు చంద్రబాబుతో మరో వైపు ఈనాడు రామోజీతో కుమ్మక్కై రాష్ట్రాన్ని దోచుకు తింటున్నది మీరు కాదా ...అని నియదీశారు. వై ఎస్ ఉన్నపుడు ఒక విదంగా లేనప్పుడు మరోరకంగా మాట్లాడవద్దు .. పదవులకోసం దిగజారవద్దు .. కడప,పులివెందుల,కొవ్వూర్ ఎన్నికలలో ప్రజలు చెప్పులతో కొట్టిన వీరికి బుద్ది రాలేదు... అన్నారు .. కాంగ్రెస్ పార్టీకి ఆ నేతలకు వయసు పెరిగింది కానీ ... కారెక్టర్ లేదు ...అని విమర్శించారు.
తన హయాంలో రైతుల భూములన్నీ లాక్కుని ..తన బినామీలకు వేల కోట్ల రూపాయల భూముల కట్టపెట్టి ... భూముల కోసం ఇవాళ నందిగ్రామ్ ఉద్యమం చేస్తాననటా నికి చంద్రబాబుకు సిగ్గు ఉండాలి అని అన్నారు. రాజకీయంగా లబ్ది పొందేందుకే చంద్రబాబు అలిపిరి అటాక్ డ్రామా ఆడాడని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని వేషాలు వేసిన .. గతంలో వచ్చిన పాలితాలే వస్తాయని జోష్యం చెప్పారు .

రాష్ట్రంలో రైతుల పరిస్తితి దారుణంగా ఉందని .. అనేక సార్లు రైతుల సమస్యలను జగన్మోహన్ రెడ్డి గారు ప్రబుత్వమ్ దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకపోవడం కాక ... నిర్లక్ష్యం వ్యవహరించిందన్నారు. రైతుల సమస్యలపై ఇకనైనా మేల్కొనపోతే ... వరంగల్ తరహాలో మరిన్ని తిరుగుబాటులు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ నేత స్టూడియోలో మేకప్ వేసుకొని కూర్చుంటాడు ఐనా విలువల గురించి మాట్లాడతాడని ...విమర్శించారు.

వైఎస్ఆర్ పార్టీ నేత మరో తాజా మాజీ ఎం‌ఎల్‌ఏ  కె. శ్రీనివాసులు మాట్లాడుతూ .ఎం‌ఎల్‌ఏలకు ప్యాకేజీలు ప్రకటించింది మీరు కాదా అని ప్రశ్నించారు.వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు ...వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఎన్నికలు వచ్చాయి అని అన్నారు. 2009 లో జరిగిన ఎన్నికలో వై ఎస్ తన రెక్కల కష్టం మీద అదికారం తెస్తే ..ఆయనను దోషిగా చూపెడుతున్నారు అని అన్నారు. జరగబోయే 18 ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోయే పరిస్తితి వస్తుందని అన్నారు .

Back to Top