దేశచరిత్రలోనే రికార్డ్..!9నెలల పాటు వేల కి.మీ.యాత్ర..!<br/>దివంగత ముఖ్యమంత్రి ప్రియతమ నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం యాత్ర రెండు వంసతాలు పూర్తిచేసుకుంది. ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్ర ప్రభంజనం. ఆనాడు కాంగ్రెస్, టీడీపీలు చేసిన కుట్రలపై ఎలుగెత్తుతూ ఆమె సాగించిన ప్రజాప్రస్థానం యాత్ర అప్పట్లో రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. <br/>వైఎస్. రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో వైఎస్ జగన్ వదిలిన బాణంగా షర్మిల తన యాత్రను నిర్విరామంగా కొనసాగించారు. పల్లెపల్లెన గడగడప రాజన్న బిడ్డ, జగన్ అన్న సోదరిని అక్కున చేర్చుకొని ఆదరించింది. షర్మిల 9 నెలలపాటు 14 జిల్లాల్లో 116 నియోజకవర్గాల మీదుగా 3,112 కిలోమీటర్లు పాదయాత్ర చేసి... దేశ రాజకీయ చరిత్రలోనే సంచలన రికార్డు నెలకొల్పారు. <br/>మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర తుది మజిలీ అయినా, తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండో విడత ఓదార్పు యాత్ర ప్రారంభ ప్రాంతమైనా, తనయ షర్మిల మరో ప్రజాప్రస్థానం ముగింపు అన్నీ ఇచ్చాపురంలో జరగడం ఆశ్చర్యదాయకం. అలా వైఎస్. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంతో బంధం పెనవేసుకుంది. <br/>