ఆళ్లగడ్డ: ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలుచేస్తున్న కార్యక్రమాలు ప్రపంచంలో ఎక్కడా కూడా లేవని ఆ దేశ ప్రతినిధులు పేర్కొన్నారని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. వైయస్ జగన్ ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉంటుందని కితాబు ఇచ్చినట్లు చెప్పారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం రెండో విడత సాయం కార్యక్రమంలోమంత్రి మాట్లాడారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఏమన్నారంటే.. అందరికీ నమస్కారం, ఈ శుభ సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మ్యానిఫెస్టోలో చెప్పినదానికన్నా ఎక్కువగా ఇచ్చిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారే, రైతులకు అనేక పథకాలు అమలవుతున్నాయి, ఉచిత పంటల బీమా ద్వారా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా రైతాంగానికి అండగా నిలిచి, దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ కార్యక్రమం అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం మనది. విత్తనం నుండి విక్రయం వరకు ఆర్బీకేలు రైతాంగానికి అండగా ఉంటున్నాయి, రైతులకు ఈ క్రాప్ బుకింగ్ కానీ ఈ కేవైసీ కాని, ఎరువులు, విత్తనాలు, ఉత్పాదకాల నాణ్యతను పరిక్షించడానికి 147 అసెంబ్లీ స్ధాయిలో ల్యాబులు, 13 జిల్లా స్ధాయిలో, 4 రీజనల్ కోడింగ్ సెంటర్స్ ఏర్పాటుచేయడం జరిగింది. వైఎస్‌ఆర్ పొలంబడి ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతాంగానికి అందజేస్తున్నాం, వ్యవసాయ సలహా మండలి ఏర్పాటుచేసి సచివాలయం, మండలం, జిల్లా స్ధాయిలో దాదాపు లక్షమంది రైతులతో ఏర్పాటుచేసిన ప్రభుత్వం మనది. వ్యవసాయ రుణాలు అత్యధికంగా ఇవ్వడం జరిగింది, టీడీపీ హయాంలో రైతు రధం పేరుతో దోచుకున్న చరిత్ర, కానీ ఇప్పుడు మీరు ఎంపిక చేసుకున్న మోడల్‌ను నేరుగా ఇచ్చిన ఘనత ఈ సీఎంగారిది. త్వరలోనే దాదాపు రూ. 200 కోట్లతో డ్రోన్లను కూడా ఏర్పాటుచేసి రైతాంగానికి అండగా ఉండాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది. రైతాంగానికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది ఉన్నా సాయం చేస్తున్నాం. ఈ మూడేళ్ళలో ఒక్క కరవు మండలం కూడా ప్రకటించలేదు, కానీ చంద్రబాబు కరవు కవలపిల్లలు కాబట్టి వందల సంఖ్యలో ప్రకటించారు. సీఎంగారు ఎప్పుడూ చెప్పే మాట రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించి ఆ విధంగా అడుగులు వేస్తున్నారు, సీఎంగారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించి నిండు నూరేళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండే విధంగా మీ అందరూ ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్నీ ఆర్‌బీకేల్లోనే అందుతున్నాయి: దూదేకుల గుర్రప్ప, రైతు జగనన్నా నమస్కారం, అన్నా నేను ఏడు ఎకరాల సాగు చేస్తున్నాను, గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా సాయం అందింది, మూడేళ్ళ పాటు ఏటా రూ. 13,500 చొప్పున తీసుకున్నాను. మీరు వేశారు నా అకౌంట్‌లో వచ్చాయి, నాకు పంట నష్టం సాయం కూడా అందింది, దానికింద అక్షరాలా రూ. 30 వేలు సాయం అందింది, పంటల బీమా కూడా అందుతుంది, ప్రతి రైతు ఈ కేవైసీ చేయించుకోవాలి, పంటల బీమా చేయించుకోవాలి. నేను 20 ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నాం, గతంలో ఎరువుల కోసం క్యూలైన్లో నిలబడి ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం కానీ ఈ రోజు మన గ్రామంలో ఆర్బీకేలో మనకు అందుతున్నాయి, అన్నీ ఇక్కడే అందుతున్నాయి, జగనన్నా మేం గ్రూప్‌గా ఏర్పడి ట్రాక్టర్, కంకుల కటింగ్ మిషన్, ఇతర సామాగ్రి తీసుకున్నాం, మాకు సబ్సిడీ అందింది, మేం రైతులకు తక్కువ రేట్‌లకే వ్యవసాయ పనులకు పనిముట్లను ఇస్తున్నాం, మా అమ్మకు క్యాన్సర్ ఆపరేషన్ జరిగితే సీఎంఆర్‌ఎఫ్ కింద రూ. 60 వేలు వచ్చాయి, కొడుకుగా నా బాధ్యత జగన్ తీసుకున్నారని అమ్మ సంతోషపడింది. మా కుటుంబ సభ్యుడివి అన్నా, ఇన్‌పుట్ సబ్సిడీ కూడా అందింది, మన జగనన్నను మనం 175 కి 175 సీట్లతో గెలిపించాలి, మన రైతులు, మన అక్కచెల్లెల్లు మనం గెలిపించుకోవాలి, ధన్యవాదాలు. థ్యాంక్యూ జగనన్న: భూక్యే క్రిష్ణానాయక్, గిరిజన రైతు జగనన్నా నేను నిరుపేద గిరిజన రైతును, నాలుగేళ్ళుగా వ్యవసాయం చేస్తున్నాను, మా నాన్న పొలం ఇచ్చాడు కానీ పంట పెట్టుబడికి డబ్బు ఇవ్వలేదు, జగనన్న వచ్చిన తర్వాత పంట పెట్టుబడి సాయం ఇవ్వడంతో నేను వ్యవసాయం మొదలుపెట్టాను, సాగు చేస్తున్నాను, నాకు ఆర్బీకేల ద్వారా పొలంబడిలో అవగాహన కల్పించారు, నేను వరి వేస్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయాను, కానీ జగనన్న ప్రవేశపెట్టిన పంటల బీమా, ఈ కేవైసీ ద్వారా సీజన్ ముగిసేలోగా నాకు రూ. 40 వేలు వచ్చాయి, బ్యాంకు నుంచి లోన్ తీసుకుని సకాలంలో కట్టడం వలన దానికి సున్నావడ్డీ కింద రూ. 3 వేలు వచ్చాయి, గతంలో ఎన్నడూ పంట నష్టం, ఇన్‌పుట్ సబ్సిడీ రాలేదు, ఇప్పుడు అన్నీ వస్తున్నాయి. మా నాన్నకు ఫించన్ వస్తుంది, మా అమ్మ, నాన్నకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సలు జరిగాయి, మీ వల్లే ఆయన బతికారు, ఈ రోజు ఈ సభకు కూడా మిమ్మల్ని చూడాలని వచ్చారు, తెలుగుగంగ ప్రాజెక్ట్ కెనాల్‌కు పిల్లకాలువలు డాక్టర్ వైఎస్‌ఆర్‌గారు తవ్వించి ఈ నియోజకవర్గానికి సాగు, తాగు నీరు ఇచ్చారు, వైయస్‌ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని ప్రారంభించినందుకు మా గిరిజనుల తరపున మీకు ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు.