అమరావతి: ప్రజల గొంతుక వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటూ వైయస్ఆర్‌సీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన తర్వాత ప్రతిపక్షాన్ని గుర్తించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ వైయస్ఆర్‌సీపీ సభ్యులు నినాదాలు చేశారు. అయితే సభలో సభ్యుల ఆందోళనను పట్టించుకోకుండా గవర్నర్ ప్రసంగం కొనసాగించడంతో సభ్యులు.. ఆ తర్వాత వైయస్ఆర్‌సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. కాగా, 2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఈ నెల 28న తేదీన సభలో ప్రవేశపెట్టేందుకు కూటమి సర్కార్ సిద్ధం అవుతోంది.