మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్‌ మంజూరు

విజయవాడ: బాపట్ల మాజీ ఎంపీ, వైయ‌స్ఆర్‌సీపీ నేత నందిగం సురేష్‌కు బెయిల్‌ మంజూరైంది. ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై గతంలో జరిగిన దాడి ఘటనలో నందిగం సురేష్‌పై టీడీపీ అక్రమ కేసు మోపిన సంగతి తెలిసిందే.    
కాగా, గుంటూరు స‌బ్‌జైల్‌లో ఉన్న  నందిగం సురేష్‌ను ఇటీవ‌ల వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబ స‌భ్యుల‌కు ఆయ‌న అండ‌గా నిలిచారు. నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరు కావ‌డం ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Back to Top