తాడేపల్లి: భారతజాతి గర్వించదగ్గ గొప్ప మేధావి భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం అని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కొనియాడారు. క్షిపణి పితామహుడు, భావితరాలకు మార్గదర్శి అబ్దుల్‌కలాం స్ఫూర్తి దేశానికే ఆదర్శమని గుర్తు చేశారు. మంగళవారం వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం నిర్వహించారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, నాయకులు మందపాటి శేషగిరిరావు, పలువురు నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు.