వ‌ర‌ద బాధితుల‌కు బీటెక్‌ విద్యార్ధిని రూ. ల‌క్ష విరాళం  

వైయ‌స్ జ‌గ‌న్‌కు చెక్కు అంద‌జేసిన కీర్త‌నారెడ్డి

తాడేప‌ల్లి: విజయవాడ వరద సహాయక చర్యల నిమిత్తం మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డికి బీటెక్‌ విద్యార్ధిని బొమ్మారెడ్డి కీర్తనా రెడ్డి ల‌క్ష రూపాయ‌ల విరాళాన్ని అంద‌జేశారు. గుంటూరు జిల్లా మెల్లంపూడికి చెందిన బీటెక్‌ విద్యార్ధిని బొమ్మారెడ్డి కీర్తనా రెడ్డి త‌న‌ తల్లిదండ్రులు బొమ్మారెడ్డి సునీత, అజార్‌రెడ్డి తాడేప‌ల్లిలోని వైయ‌స్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయ‌స్ జ‌గ‌న్‌ను కలిసి తన పాకెట్‌ మనీ నగదు రూ. 1,00,000 అందజేశారు.  ఈ సంద‌ర్భంగా కీర్త‌నారెడ్డిని వైయ‌స్ జ‌గ‌న్ అభినందించారు.

Back to Top