నెల్లూరు:సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు.శనివారం నెల్లూరులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి కాకాణి మీడియాతో మాట్లాడారు. ‘జరుగుతున్న పరిణామాలపై జిల్లా ఎస్పీకి వివరించబోతున్నాం. కూటమి ప్రభుత్వంలో వాక్ స్వాతంత్య్రం కూడా కూడా లేకుండా పోయింది.నాపైనే పోలీసులు అక్రమంగా నాలుగు కేసులు నమోదు చేశారు. వైయస్ఆర్‌సీపీ నేతలు నోరు తెరిచినా కూడా కేసులు పెడుతున్నారు.పోలీసులు మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి చివరికి కుటుంబ సభ్యులను కూడా దుషిస్తున్నారు. అవినీతిని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారు. వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్‌ను కించపరిచే విధంగా పోస్టులు పెడుతుంటే మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదు. జగన్ కుటుంబ సభ్యుల మీద కూడా నీచాతి నీచంగా పోస్టులు పెడుతుంటే అవి పోలీసులకు కనపడవా..? పోలీసులు ఖాకీ చొక్కాలు వదిలేసి..పచ్చ చొక్కాలు వేసుకుని డ్యూటీలు చేస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ నేతలు ఆవేదనతో ఉన్నారు..వారిని రెచ్చగొట్టొద్దు.శాంతిభద్రతలు అదుపుతప్పితే పోలీసులదే బాధ్యత.వైయస్ జగన్‌పై పోస్టింగ్‌లు పెడుతున్న వారిని వెంటనే అరెస్ట్ చెయ్యాలి. మేం అధికారంలోకి వస్తే ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిని వదిలే ప్రసక్తే లేదు.ఎక్కడ దాక్కున్నా లాక్కొస్తాం’అని కాకాణి హెచ్చరించారు. కాగా, కాకాణి గోవర్ధన్‌రెడ్డికి వెంకటాచలం పోలీసులు రెండు కేసుల్లో నోటీసులు అందజేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ నేత చేసిన ఆరోపణల వీడియోను ఫార్వర్డ్ చేసిన కేసులో ఒక నోటీసు, చంద్రబాబు 100 రోజుల పాలనపై విమర్శించినందుకు మరో నోటీసు అందజేశారు.ఈ కేసుల్లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.